హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. తొలిసారిగా గ్రీన్ ఛానల్..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ మెట్రో ఓ మహాత్కార్యానికి వేదిక కాబోతోంది. తొలిసారిగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సలో తన వంతు సాయాన్ని అందించబోతోంది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో వైద్యులు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను వైద్యులు నిర్వహించనున్నారు. డాక్టర్ గోకులే ఆధ్వర్యంలో జరగనున్న ఈ శస్త్ర చికిత్స కోసం వైద్యులు మెట్రో సాయం తీసుకోనున్నారు. వైద్యుల కోరిక మేరకు అధికారులు సైతం మెట్రోలో గుండెను తరలించేందుకు అవసరమైన సాయం అందిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన ఓ 45 ఏళ్ల రైతు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సదరు రైతుకు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో అవయవదానం చేసేందుకు సదరు రైతు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. కట్ చేస్తే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఓ వ్యక్తి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను వైద్యులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రెయిన్ డెడ్ అయిన రైతు గుండెను ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించాల్సి ఉంది.
అయితే హైదరాబాద్‌లో ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన పని లేదు. భారీగా పెరిగిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసి గుండెను తరలించడం చాలా పెద్ద ప్రాసెస్. కాబట్టి మెట్రో సాయం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో నగరంలో మొదటిసారిగా మెట్రోతో గ్రీన్ ఛానల్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం నాగోలు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకూ మెట్రో సర్వీసును నాన్ స్టాప్‌గా నడపనున్నారు. ఇక చెక్‌పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రి వరకూ రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments