హార్ట్ ఆపరేషన్ జరిగింది.. నేను క్షేమమే! : శశి ప్రీతమ్

  • IndiaGlitz, [Tuesday,June 09 2020]

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఈ నెల 4న ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ రోజు (మంగళవారం) డిశ్చార్చ్ అవుతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ’, ‘సముద్రం’ తదితర చిత్రాలు ఆయన సంగీతం అందించారు. తన ఆరోగ్యం గురించి పలు వార్తలు నేపథ్యంలో శశి ప్రీతమ్ వివరణ ఇచ్చారు.

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ మాట్లాడుతూ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనెల 4వ తేదీ ఉదయం నాకు గుండెపోటు వచ్చింది. వెంటనే నా మిత్రుడు రాజు గారు బంజారాహిల్స్ సెంచరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. హార్ట్ లో బ్లాక్ ఉందని యాంజియోప్లాస్టి చేశారు. ఒక స్టంట్ వేశారు. మాసివ్ హార్ట్ ఎటాక్ నుండి నన్ను సేవ్ చేశారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరికీ పేరుపేరునా థాంక్స్’ అని అన్నారు.

డాక్టర్ అమీనుద్దిన్ ఒవైసీ మాట్లాడుతూ.. సెంచరీ హాస్పిటల్ లో శశి ప్రీతమ్ కన్సల్టెంట్ డాక్టర్ నేనే. జూన్ 4న ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన మా దగ్గరికి వచ్చారు. హార్ట్ ఎటాక్ అని గ్రహించాను. యాంజియోగ్రామ్ చేసి, తర్వాత స్టంట్ వేశాం. ‌ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఐసీయూలో 24 గంటల్లో అబ్జర్వేషన్ లో ఉంచాము. ఆయన చాలా త్వరగా కోలుకున్నారు. ఇప్పుడు ఆయన వాకింగ్ కూడా చేస్తున్నారు. ఆయనకు ఇతర సమస్యలు ఏవీ లేవు. ఇతర వ్యాధి లక్షణాలు కూడా కనిపించలేదు’ అని అన్నారు.

More News

రేవంత్ రెడ్డి వ్యవహారం : ఇది నా తప్పే సరిచేసుకుంటా!

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు గుప్పించారని సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ చానెల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఏపీ-తెలంగాణల మధ్య చెక్ పోస్టులు ఎత్తేయలేదు..!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0 విధించిన విషయం విదితమే. ఇందులో భాగంగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి.

హీరోల్లారా.. జగన్‌రెడ్డికి మీరూ ఒక్క మాట చెప్పండి!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్న విషయం తెలిసిందే.

ఆందోళనకరంగా డైరెక్టర్ సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితి!

తెలుగు దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేసి ‘రాజుగాడు’ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకురాలిగా పరిచయం అయిన సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

జగన్‌తో భేటీకి చార్టడ్ ఫ్లైట్‌లో చిరు, నాగ్, జక్కన్న

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు ఇవాళ భేటీ కానున్నారు.