Chandrababu Naidu:స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

  • IndiaGlitz, [Friday,September 15 2023]

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది. స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారణకు స్వీకరించిన ఏసీబీ న్యాయస్థానం విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అంశాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ వస్తే క్వాష్ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుకు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ :

కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబు నాయుడుకు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఏసీబీ కోర్ట్. దీంతో ఆయనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అర్ధరాత్రి జైలుకు చేరుకున్న ఆయనకు అధికారులు ‘‘7691’’ నెంబర్‌ను కేటాయించారు. మరోవైపు జైలులో చంద్రబాబుకు మిగిలిన ఖైదీలలాగా కాకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఏసీబీ కోర్ట్ ఆదేశించింది. చంద్రబాబుకు జైలులో ప్రత్యేక గది ఏర్పాటు చేయడంతో పాటు భద్రత కల్పించనున్నారు. చంద్రబాబుకు ఇంటి భోజనంతో పాటు మందులను అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

చంద్రబాబుకు జైల్లో పరామర్శలు :

ఇప్పటికే జైలులో చంద్రబాబును ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి పరామర్శించారు. నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ, కుమారుడు లోకేష్‌లు పరామర్శించిన సంగతి తెలిసిందే. అటు చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.

More News

AP CM YS Jagan:ఆరోగ్యాంధ్రప్రదేశే జగన్ లక్ష్యం.. ఏపీ వైద్య రంగంలో కీలక మైలురాయి, ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లు ఓపెనింగ్

ఒక రాష్ట్రం అద్భుతంగా పురోగతి సాధించడానికి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం.

Bigg Boss 7 Telugu : హౌస్‌మేట్స్‌ను బఫూన్స్ అన్న రతిక.. కంటతడిపెట్టిన అమర్‌దీప్

బిగ్‌బాస్ హౌస్‌లో అస్త్రాల కోసం వేట మొదలైన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇచ్చిన టాస్కులు,

Jana Sena:ముసుగు తొలగింది.. ‘‘పొత్తు’’ పొడిచింది, బలి కావడానికి జనసైనికులు సిద్ధమా..?

ముసుగు తొలగిపోయింది.. ఎప్పుడెప్పుడు విషయం చెబుదామా అని ఎదురుచూసిన వారికి మంచి ముహూర్తం రానే వచ్చింది.

తొలి రోజునే 29 మిలియన్ల మంది వీక్షణ

"బిగ్ బాస్ సీజన్ 7" ఊహించినట్టుగానే ఎన్నో సంచలనాలు సృష్టించింది. రేటింగ్స్ పరంగా, వ్యూయర్ షిప్ పరంగా ఊహించని ఎన్నో అద్భుతాలకు "బిగ్ బాస్ సీజన్ 7" వేదిక అయింది.

Navadeep:మాదాపూర్ డ్రగ్స్ కేసు : పరారీలో నవదీప్ , సీపీ ప్రకటన .. ఎక్కడికి పారిపోలేదన్న హీరో

టాలీవుడ్ యువ హీరో నవదీప్ మరోసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఇటీవల వెలుగుచూసిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో