యూట్యూబ్ ఛానెల్స్‌పై పరువు నష్టం దావా: తీర్పుపై సమంతలో ఉత్కంఠ..!!
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతపై సోషల్ మీడియాలో ఇష్టానుసారం కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు వేరొకరితో సంబంధం ముడిపెట్టడంతో పాటు అబార్షన్ కూడా చేయించుకుందంటూ సోషల్ మీడియాతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లోనూ కథనాలు వచ్చాయి. దీనికి ఘాటుగానే రియాక్ట్ అయ్యారు సమంత. తన వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని.. కానీ తనకు ఎవరితోనూ ఎఫైర్స్ లేవని, అబార్షన్స్ చేయించుకోలేదని సమంత అన్నారు. తన మానాన తనను వదిలివేయాలని మీడియాను రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ పరిస్ధితిలో ఏమాత్రం మార్పు లేదు. ఆమెను టార్గెట్ చేస్తూ నిరాధార వార్తలు చక్కర్లు కొడుతూనే వున్నాయి. ఇక సహనం నశించిన సమంత తాను తీసుకున్న నిర్ణయంపై అసత్య ప్రచారాలు చేసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్ట దావా పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్‌పై గురువారం కూకట్‌పల్లి కోర్టు విచారణ జరిపింది. సమంత పిటిషన్లు త్వరగతిన విచారించాలని కోర్టును ఆమె తరఫు న్యాయవాది బాలాజీ కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం .. కోర్టు ముందు సామాన్యులు అయినా.. సెలబ్రిటీలు అయినా ఒక్కటే అని స్పష్టం చేసింది. సమంత పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది బాలాజీ కోర్టును కోరారు. ఐతే… తప్పు జరిగిందని భావిస్తే…. పరువునష్టం దాఖలు చేసే బదులు, వారి నుండి క్షమాపణలు కోరవచ్చు కదా అని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టేది వారే… పరువుకు భంగం కలిగింది అని చెప్పేది కూడా వారే కదా అని కోర్టు కామెంట్ చేసింది.
సమంత ఇంకా విడాకులు తీసుకోలేదనీ… ఆ లోగానే ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమన్నారు న్యాయవాది బాలాజీ. సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాశారని.. ఆమెకు అఫైర్స్ అంటగట్టారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా … పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని బాలాజీ కోర్ట్‌ను కోరారు. వాదనలను పరిగణనలోనికి తీసుకున్న కోర్ట్.. తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో న్యాయస్థానం తీర్పుపై ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments