చిరుకి డీహైడ్రేషన్.. అర్థాంతరంగా నిలిచిపోయిన షూటింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం చిరు ఖమ్మంలో ఉన్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందు బొగ్గుగనిలో ‘ఆచార్య’ షూటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే వేసవి కాలం కారణంగా బొగ్గు గనుల్లో విపరీమైన వేడి ఉంది. దీంతో చిరు డీహైడ్రేషన్‌కు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆచార్య షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయినట్టు సమాచారం. నిజానికి అక్కడ ఏడు రోజుల పాటు షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ మూడు రోజుల్లోనే ఈ షూటింగ్‌ను ముగించినట్టు సమాచారం.
ఖమ్మం జిల్లాలో చాలా ఆడంబరంగా ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభమైంది. ఇల్లందులోని జేకే మైన్స్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్.. చిరుకి తమ నివాసంలో బస ఏర్పాటు చేశారు. గత మూడు రోజులుగా చిరు వరుసగా షూటింగ్‌లో పాల్గొంటూ వస్తున్నారు. వాస్తవానికి ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి కారణంగా వేడి తీవ్రత బాగా పెరిగింది. దీంతో చిరుతో పాటు ఇతర నటీనటులు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏడు రోజుల పాటు జరగాల్సిన షూటింగ్‌ను మూడు రోజుల్లో ముగించినట్టు తెలుస్తోంది. అయితే చిరు డీహైడ్రేషన్ కారణంగా కొంత అస్వస్థతకు గురవడంతో వెంటనే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరి వెళ్లినట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com