'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' షూటింగ్ పూర్తి...సంక్రాంతికి విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, సహజనటి జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం`హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య`. చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా...
దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ - ``నారాయణమూర్తి, జయసుధగారితో చేసిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య ప్రస్తుతం సమాజంలో ప్రధాన సమస్య ఆధారంగా రూపొందింది. అదేంటనేది సినిమా చూడాల్సిందే. ఓ నిజాయితీ గల హెడ్ కానిస్టేబుల్ తన నిజాయితీతో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. దాన్ని ఎలా అధిగమనించాడనేదే కథ. మంచి కథ, అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. నారాయణమూర్తి, జయసుధ కలిసి తెరపై కనపడబోతున్నారని తెలియగానే ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి ఏర్పడింది. జయసుధగారు, నారాయణమూర్తిగారు ఇద్దరూ చాలా గొప్పగా నటించారు. వీరితో పాటు మిగిలిన అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ సపోర్ట్‌తో అనుకున్న విధంగా సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యింది. జనవరి మొదటి వారంలో సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి, పాటలను కూడా జనవరి మొదటివారంలోనే విడుదల చేస్తాం. అలాగే సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
ఆర్.నారాయణమూర్తి, జయసుధ, సునీల్ శర్మ, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ల భరణి, చలపతిరావు, వెన్నెల కిశోర్, వై.విజయ, సమీర్, విజయ భాస్కర్, విజయ్, పార్వతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.సుధాకర్ రెడ్డి, ఎడిటర్: మోహన రామారావు, నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం, ఫైట్స్: సతీష్ మాస్టర్, సమర్పణ: చదలవాడ తిరుపతిరావు, నిర్మాత: చదలవాడ పద్మావతి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments