హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య ఆడియో రిలీజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్.నారాయణమూర్తి, జయసుధ జంటగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీమతి చదలవాడి పద్మావతి నిర్మించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఆడియో సీడీని ఎస్.పి.నాయక్ ఆవిష్కరించి తొలి సీడీను జయసుధకు అందచేసారు.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ...ఆడియో ఫంక్షన్ అంటే ఎప్పుడు ఈ ఫంక్షన్ అవుతుందా అనిపిస్తుంటుంది. ఈ ఆడియో ఫంక్షన్ రెండు గంటలు అయినా ఆర్.నారాయణమూర్తి గారు అప్పుడే అయిపోయిందా అనేట్టుగా యాంకరింగ్ చేసారు. టైమ్ తెలియలేదు. చదలవాడ శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి ఈ కథ చెప్పి హీరోయిన్ గా చేయాలి అన్నారు. మా పాత నిర్మాత కాబట్టి ఫోన్ లో కథ అర్ధం కాకపోయినా ఓకే అనేసాను. షూటింగ్ కి వచ్చిన తర్వాత హీరోయిన్ కు పదేళ్ల పాప అని తెలిసి భయమేసింది. ఈ క్యారెక్టర్ కు నేను సూట్ అవుతానా అనిపించింది. ఈ చిత్రంలో నారాయణమూర్తికి నాకు ఓ పాట కూడా ఉంది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అవుతుంది. సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకనిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ....మా బ్యానర్ ను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు. నేను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామోజీరావు గారు క్లాప్ కొట్టారు. మా నారాయణమూర్తి, జయసుధ జంటగా నటించారు. స్టూడెంట్స్ లా నేను చెప్పినట్టుగా నారాయణమూర్తి, జయసుధ నటించారు. వందశాతం తృప్తిగా వచ్చింది. సోసైటికి ఉపయోగపడే చిత్రం ఇది అన్నారు. ఈ కార్యక్రమంలో చదలవాడ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com