హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య ఆడియో రిలీజ్..!

  • IndiaGlitz, [Monday,January 09 2017]

ఆర్.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ జంట‌గా తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీమ‌తి చ‌ద‌ల‌వాడి ప‌ద్మావ‌తి నిర్మించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది. ఆడియో సీడీని ఎస్.పి.నాయ‌క్ ఆవిష్క‌రించి తొలి సీడీను జ‌య‌సుధ‌కు అంద‌చేసారు.

ఈ సంద‌ర్భంగా జ‌య‌సుధ మాట్లాడుతూ...ఆడియో ఫంక్ష‌న్ అంటే ఎప్పుడు ఈ ఫంక్ష‌న్ అవుతుందా అనిపిస్తుంటుంది. ఈ ఆడియో ఫంక్ష‌న్ రెండు గంట‌లు అయినా ఆర్.నారాయ‌ణ‌మూర్తి గారు అప్పుడే అయిపోయిందా అనేట్టుగా యాంక‌రింగ్ చేసారు. టైమ్ తెలియ‌లేదు. చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు గారు ఫోన్ చేసి ఈ క‌థ చెప్పి హీరోయిన్ గా చేయాలి అన్నారు. మా పాత నిర్మాత కాబ‌ట్టి ఫోన్ లో క‌థ అర్ధం కాక‌పోయినా ఓకే అనేసాను. షూటింగ్ కి వ‌చ్చిన త‌ర్వాత హీరోయిన్ కు ప‌దేళ్ల పాప అని తెలిసి భ‌య‌మేసింది. ఈ క్యారెక్ట‌ర్ కు నేను సూట్ అవుతానా అనిపించింది. ఈ చిత్రంలో నారాయ‌ణ‌మూర్తికి నాకు ఓ పాట కూడా ఉంది. ఆ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా సంక్రాంతికి పెద్ద సినిమాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ద‌ర్శ‌క‌నిర్మాత చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ....మా బ్యాన‌ర్ ను స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు గారు ప్రారంభించారు. నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి రామోజీరావు గారు క్లాప్ కొట్టారు. మా నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ జంట‌గా న‌టించారు. స్టూడెంట్స్ లా నేను చెప్పిన‌ట్టుగా నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ న‌టించారు. వంద‌శాతం తృప్తిగా వ‌చ్చింది. సోసైటికి ఉప‌యోగ‌ప‌డే చిత్రం ఇది అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

నిజ‌మైన అభిమానులు అలాగే కోరుకుంటారు - డైరెక్ట‌ర్ క్రిష్

గ‌మ్యం, వేదం, కృష్ణ‌మ్ వందే జ‌గ‌ద్గురుమ్, కంచె...ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ క్రిష్. నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.

నిన్నకబాలి - నేడు ఖైదీ నెం 150..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.

యూత్ ని ఆకట్టుకునే 'లవర్స్ క్లబ్' ఫస్ట్ లుక్

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో, భరత్ అవ్వారి నిర్మాతగా ధృవ శేఖర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర, పావని ,ఆర్యన్. పూర్ణి లు జంటగా మెట్టమెదటి సారిగా ఎమెషనల్ లవ్స్టోరి గా తెరకెక్కిన చిత్రం లవర్స్క్లబ్. ఈ చిత్రాన్ని ప్లాన్ ‘బి’ ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆ వ్యాఖ్య‌లు నేను ప‌ట్టించుకోను...వాళ్ల విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తాను - చిరంజీవి

చిరు పాత్ర‌ల‌తో న‌ట ప్ర‌స్ధానం ప్రారంభించి...సామాన్య స్ధాయి నుంచి అసామాన్య స్ధాయికి ఎదిగి..త‌నో శ‌క్తిగా ఎదిగి ప్రేక్ష‌క హృద‌యాల్లో చిరంజీవిగా సుస్ధిర స్ధానం సంపాదించుకుని హీరోల‌కే హీరో అయిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి...!

బన్ని మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్టయ్యింది...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,దిల్ రాజు,హరీష్ శంకర్,దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం 'డిజె..దువ్వాడ జగన్నాథమ్'.