బెంగాల్ టైగర్ తో వణికిస్తాడట
- IndiaGlitz, [Wednesday,October 14 2015]
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు. కె.కె.రాధామోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బెంగాల్ టైగర్ టీజర్ ను డైరెక్టర్ సంపత్ నంది రిలీజ్ చేసారు. నేను క్లైమేట్ లాంటోడ్ని..అప్పుడప్పుడు చల్లగా ఉంటా...అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా..అప్పుడప్పుడు వణికిస్తా..అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ తో టీజర్ తో రూపొందించారు.
రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు మాస్ ఆడియోన్స్ ను ఆకట్టుకునేలా ఈ టీజర్ ఉంది. బెంగాల్ టైగర్ ఆడియోను దసరా కానుకగా ఈనెల 18న, సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.మరి... కిక్ 2 తో విజయం సాధించలేకపోయిన రవితేజ బెంగాల్ టైగర్ తో అయినా విజయం సాధిస్తాడో..? లేదో...? చూడాలి.