తన బయోపిక్‌లో మహేశ్ నటించాలట
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్స్ ఎక్కువగా నడుస్తుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు సంబంధించిన బయోపిక్స్ రూపొందుతున్నాయి. కాగా ఈ లిస్టులో వి.వి.ఎస్.లక్ష్మణ్ బయోపిక్ కూడా రూపొందాల్సిందట.
నిజానికి కొంత మంది దర్శక నిర్మాతలు ఈ క్రికెటర్‌ను కలిశారట. ఈ విషయాన్ని వి.వి.ఎస్.లక్ష్మణ్ తెలిపారు. లక్ష్మణ్ బయోగ్రఫీ '281 అండ్ బియాండ్' విడుదలైంది. ఈ పుస్తకావిష్కరణ సమయంలో కొంత మంది ఆయన్ను బయోపిక్ గురించి అడిగితే.
తనను కొంత మంది దర్శక నిర్మాతలు కలిశారని, తన బయోపిక్‌లో మహేశ్ నటించాలని వారిని కోరినట్లు తెలిపారు. మహేశ్‌బాబు ఉన్న బిజీలో ఆయన్ను ఈ పాత్రకు ఒప్పించడం చాలా కష్టతరమైన విషయం. అందుకే నిర్మాతలు కామ్ అయిపోయి ఉంటారు. మరి మహేశ్ బాబు ఈ స్టార్ క్రికెటర్ కోరిక తీరుస్తాడంటారా.. చూద్దాం
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments