సర్జికల్ స్ట్రైక్స్‌కు స్కెచ్ వేసింది ఈయనే...
Send us your feedback to audioarticles@vaarta.com
ఉగ్రమూకలపై భారతసైన్యం 2016, 2019లో ఇలా రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అయితే ఈ స్ట్రైక్స్‌కు సంబంధించి స్కెచ్ వేసిందెవరు..? అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది..? అయినా అంత రహస్యంగా ఉగ్రవాదులపై స్థావరాలపై ఎలా చేస్తారు..? ఈ దాడుల స్కెచ్‌కు కర్త, కర్మ, క్రియ ఎవరు..? అనేది ఇప్పుడు యావత్ ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నది. అయితే ఇందుకు సమాధానం వన్ అండ్ ఓన్లీ.. అజిత్ దోవల్. అసలు ఈయన ఎవరు..? ఈయనకు ఇంతలా ఎలా ఆలోచిస్తున్నారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అజిత్ ట్రాక్ రికార్డ్..
1945 జనవరి 20లో జన్మించిన అజిత్ కుమార్ దోవల్.. 1968లో కేరళ క్యాడర్‌లో ఐపీఎస్‌లో చేరారు. ఐపీఎస్ (రిటైర్డ్), భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేశారు. ఈయన సేవలను మెచ్చిన మోదీ ప్రభుత్వం 2014 మే 30 నుంచి 5న జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం జరిగింది. 1990లో ఉగ్రవాదులు పేట్రేగుతున్న సమయంలో దోవల్ కశ్మీర్‌లో గుడాచారిగా అడుగుపెట్టారు. వేర్పాటువాదిగా ఉన్న కుకా పర్రయ్ లొంగిపోయేలా చేయడమే కాకుండా అతడి మనసు మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా తయారుచేశారు.
అలా క్షేత్రస్థాయిలో తానుగా లేదంటే, ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించడం, దాన్ని భద్రతా దళాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బకొట్టడం దోవల్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈయన నియామకం అనంతరం అప్పుడప్పుడే మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తన స్థావరాన్ని కరాచీ నుంచి పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లోకి మార్చుకున్నాడనీ చెబుతుంటారు. దాన్నిబట్టి ఎన్‌ఎస్‌ఏగా దోవల్ పాత్ర ఎలాంటిదో అర్థమవుతుంది. ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్‌లో ఐసిస్ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు దోవల్. పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో నిఘా వర్గాలు చురుగ్గా పనిచేసేలా దోవల్ మార్పులు తెచ్చారనీ, అందువల్లే ఛోటా రాజన్‌ను పట్టుకోగలిగారనీ చెబుతుంటారు.
రెండు సార్లు మెరుపుదాడులు ఈయన స్కెచ్చే..!
‘ఉరీ’ తీవ్రవాద దుశ్చర్య తరువాత.. ఫస్ట్ టైమ్ భారత దళాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులను విజయవంతంగా జరిపిన సంగతి తెలిసిందే. 2016 ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఈ మెరుపు దాడుల వెనుక సూత్రధారిగా అజిత్ ధోవల్ ప్రధానపాత్ర పోషించారు.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న నేపథ్యంలో అజిత్ దోవల్ మరోసారి రంగంలోకి దిగడం.. డ్రోన్ కెమెరాలతో పాటు వేర్పాటు వాదుల ఇళ్లపై వరుస దాడులు చేయించడం ఇలా పక్కా సమాచారం రాబట్టిన దోవల్.. 40 మంది అమరుల మరణానికి 400 మంది ఉగ్రమూకలు ఒకే దెబ్బకు హతమయ్యేలా స్కెచ్ గీశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పలుమార్లు తన సత్తా ఏంటో చూపిన అజిత్ దోవల్ తాజా సర్జికల్ స్ట్రైక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఈయన పేరు మార్మోగుతోంది. కాగా ఈయన స్కెచ్ వేస్తే కచ్చితంగా వర్కవుట్ అవుతుందని.. ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదని విశ్లేషకులు చెబుతుంటారు.
మంగళవారం జరిగిన సర్జికల్ స్ట్రైక్స్-2 అనంతరం భద్రతా సలహాదారు అయిన అజిత్‌తో ప్రధాని భేటీ అయ్యారు. మున్ముంథు పాక్, ఉగ్రమూకలను ఎలా ఏరివేయాలనే విషయమై చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాక్ స్పందిస్తే ఎలా తిప్పికొట్టాలి..? పాక్, చైనా ఒక్కటవుతున్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే విషయాలపై చర్చించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే గుజరాత్‌తో పాటు దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర డీజీపీ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇంత జరిగినా బుద్ధి రాని పాక్ మళ్లీ మళ్లీ కవ్వింపు చర్యకు పాల్పడుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com