ఆయనో ప్రపంచ మేధావి: శశిథరూర్

  • IndiaGlitz, [Sunday,August 30 2020]

తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోదగిన వ్యక్తి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ప్రధానిగా ఆయన చరిత్రలో నిలిచిపోయే సంస్కరణలు చేపట్టారు. బహుభాషా కోవిదుడు అయిన పీవీపై ఎంపీ శశిథరూర్ ఆదివారం ప్రశంసల జల్లు కురిపించారు. విదేశాంగ విధానం విషయంలో పీవీ నర్సింహారావు చెరగని ముద్ర వేశారన్నారు. అమెరికాతో ఆర్థికంగా బలమైన ఒప్పందాలు చేసుకున్నారన్నారు. విదేశాంగ విధానంలో సైతం అనేక మార్పులు తీసుకొచ్చారని శశిథరూర్ కొనియాడారు.

ఇరాన్‌తో పీవీ నర్సింహారావు పటిష్టమైన బంధాన్ని ఏర్పరిచారని శశిథరూర్ పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు.. లుక్ ఈస్ట్, లుక్ వెస్ట్ పాలసీని రూపొందించారన్నారు. చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు అనేక వ్యూహాలు రచించారని కొనియాడారన్నారు.కమ్యూనిజం నుంచి క్యాపిటలిజం వైపు వేగంగా అడుగులు వేశారన్నారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు పీవీ నర్సింహారావు ఒక రోల్ మోడల్‌గా నిలిచారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ అడుగు జాడల్లో నడిచి.. ఆర్థికంగా దేశాన్ని పటిష్టమైన స్థానానికి చేర్చారన్నారు. కేవలం 1991 నుంచి రెండేళ్ల‌లో లిబరలైజేషన్‌తో 36 శాతం ఎకానమి పెంపొందించారన్నారు. దేశ ఆర్థిక విషయంలో పీవీ నర్సింహరావుకు ముందు ఆ తర్వాత అని చెప్పుకోవచ్చని శశిథరూర్ పేర్కొన్నారు.

పీవీ నేతృత్వంలో భారత్.. ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందన్నారు. 1991 నుంచి 5 ఏళ్ల పాటు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ సహకారంతో ఎకానమీని పరుగులు పెట్టించారన్నారు.
పీవీ ప్రతీ నిర్ణయంతో దేశం అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. మైనారిటీ ప్రభుత్వాన్ని తన రాజకీయ చాణక్యంతో నడపగలిగారని కొనియాడారు. ఆయన ప్రపంచ మేధావి అని... దాదాపు 10 భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగే మేథస్సు ఉన్న గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీ సాధించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఇజ్రాయిల్ సాంకేతిక సహకారంతో సైన్యాన్ని పటిష్టం చేశారన్నారు. 1993లో చైనాలో పర్యటించి ఆ దేశానికి పీవీ నర్సింహారావు స్నేహ హస్తాన్ని అందించడంతో బోర్డర్‌లో ఉద్రిక్తతలు తగ్గాయని శశిథరూర్ పేర్కొన్నారు.

More News

నాని గురించి నేనిప్పుడు చెప్పకూడదు: నివేదా థామస్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం ‘వి’. నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితిరావు హైద‌రిల‌తో

కొండపల్లి బొమ్మల గురించి ‘మనసులో మాట’లో చెప్పిన మోదీ

కొండపల్లి బొమ్మల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా మోదీ ఆదివారం మాట్లాడుతూ..

మ‌హేశ్ కొత్త వ్యాపారం...!!

హీరోగానే కాదు.. నిర్మాత‌గా, ఎంటర్ ప్రెన్యూర‌ర్‌గా మ‌హేశ్ నేటి త‌రం హీరోల్లో త‌న‌దైన స్టైల్లో దూసుకెళ్తున్నారు.

అన్‌లాక్-4 మార్గదర్శకాలివే..

అన్‌లాక్-4 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.

ఐదున్నర నెలల తర్వాత మళ్లీ వర్క్ చేయబోతున్నా: నాగార్జున

తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అక్కినేని నాగార్జున గుడ్ న్యూస్ చెప్పారు. ఐదున్నర నెలల తర్వాత మళ్ళీ వర్క్ చేయబోతున్నానని నాగ్ తెలిపారు.