ఆయనో ప్రపంచ మేధావి: శశిథరూర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోదగిన వ్యక్తి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ప్రధానిగా ఆయన చరిత్రలో నిలిచిపోయే సంస్కరణలు చేపట్టారు. బహుభాషా కోవిదుడు అయిన పీవీపై ఎంపీ శశిథరూర్ ఆదివారం ప్రశంసల జల్లు కురిపించారు. విదేశాంగ విధానం విషయంలో పీవీ నర్సింహారావు చెరగని ముద్ర వేశారన్నారు. అమెరికాతో ఆర్థికంగా బలమైన ఒప్పందాలు చేసుకున్నారన్నారు. విదేశాంగ విధానంలో సైతం అనేక మార్పులు తీసుకొచ్చారని శశిథరూర్ కొనియాడారు.
ఇరాన్‌తో పీవీ నర్సింహారావు పటిష్టమైన బంధాన్ని ఏర్పరిచారని శశిథరూర్ పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు.. లుక్ ఈస్ట్, లుక్ వెస్ట్ పాలసీని రూపొందించారన్నారు. చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు అనేక వ్యూహాలు రచించారని కొనియాడారన్నారు.కమ్యూనిజం నుంచి క్యాపిటలిజం వైపు వేగంగా అడుగులు వేశారన్నారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు పీవీ నర్సింహారావు ఒక రోల్ మోడల్‌గా నిలిచారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ అడుగు జాడల్లో నడిచి.. ఆర్థికంగా దేశాన్ని పటిష్టమైన స్థానానికి చేర్చారన్నారు. కేవలం 1991 నుంచి రెండేళ్లలో లిబరలైజేషన్‌తో 36 శాతం ఎకానమి పెంపొందించారన్నారు. దేశ ఆర్థిక విషయంలో పీవీ నర్సింహరావుకు ముందు ఆ తర్వాత అని చెప్పుకోవచ్చని శశిథరూర్ పేర్కొన్నారు.
పీవీ నేతృత్వంలో భారత్.. ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందన్నారు. 1991 నుంచి 5 ఏళ్ల పాటు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ సహకారంతో ఎకానమీని పరుగులు పెట్టించారన్నారు.
పీవీ ప్రతీ నిర్ణయంతో దేశం అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. మైనారిటీ ప్రభుత్వాన్ని తన రాజకీయ చాణక్యంతో నడపగలిగారని కొనియాడారు. ఆయన ప్రపంచ మేధావి అని... దాదాపు 10 భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగే మేథస్సు ఉన్న గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీ సాధించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఇజ్రాయిల్ సాంకేతిక సహకారంతో సైన్యాన్ని పటిష్టం చేశారన్నారు. 1993లో చైనాలో పర్యటించి ఆ దేశానికి పీవీ నర్సింహారావు స్నేహ హస్తాన్ని అందించడంతో బోర్డర్లో ఉద్రిక్తతలు తగ్గాయని శశిథరూర్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments