చరణ్ కి విలన్ ఇతనే..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా తర్వాత తమిళ్ సినిమా తని ఒరువన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం భారీ మొత్తం చెల్లించి బ్రూస్ లీ నిర్మాత దానయ్య రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది.
వచ్చే నెలలో ఈ సినిమా ప్రారంభించి..డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే..ఈ చిత్రంలో చరణ్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్ లో నెగిటివ్ రోల్ ను అరవింద్ స్వామి పోషించారు. ఆ పాత్రను రానా పోషిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెగిటివ్ రోల్ కోసం మాధవన్ ను సంప్రదిస్తున్నారట. సఖి సినిమా ద్వారా మాధవన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. మరి..మాధవన్ చరణ్ సినిమాలో నెగిటివ్ రోల్ చేయడానికి సై అంటాడో...నో అంటాడో...ఏమంటాడో..చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com