కోన చెప్పిన స్టార్ అతనేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్లో మినిమం బడ్జెట్‌తో తెరకెక్కిన `బరేలీ కీ బర్ఫీ` చిత్రం ఆరవై కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిట్ చిత్రంగా నిలిచింది. ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్, కృతిసనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకుడు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ తన కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో సంయుక్తంగా రీమేక్ చేయాలనుకుంటున్నారట.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓ స్టార్ హీరోను ఈ రీమేక్‌లో నటింప చేయాలనేది కోన వెంకట్ ఆలోచనగా కనిపిస్తుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య నటించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయట. నిర్మాతలు చైతను నటింప చేయడానికి ప్రయత్నాలైతే చేశారట. చైతు కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com