‘సరిలేరు నీకెవ్వరు’: హీ ఈజ్ సో క్యూట్.. రొమాంటిక్ సాంగ్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ మాస్ సాంగ్, సెకండ్ మెలొడి సాంగ్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఈ చిత్రం నుండి అందరూ ఎదురు చూస్తున్న రొమాంటిక్ సాంగ్ ` హీ ఈజ్ సో క్యూట్ హీ ఈజ్ సో హాట్' ను ఈ రోజు సాయంత్రం 05.04 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్.
హీ ఈజ్ సో క్యూట్..హీ ఈజ్ సో స్వీట్..హీ ఈజ్ సో హ్యాండ్సమ్..అంటూ సూపర్‌స్టార్ మహేష్ గ్లామర్‌ను పొగిడే ఈ పాట సినిమాలో హీరోయిన్ మనసుని దోచుకున్నాడు కధానాయకుడు అనే సందర్భంలో వచ్చే ఫన్ సాంగ్. రష్మిక, మహేష్ ఒకరినొకరు ఆటపట్టిస్తూ సాగే ఈ రొమాంటిక్ పాటకి శ్రీమణి అర్దవంతమైన సాహిత్యం అందిచగా సింగర్ మధుప్రియ చక్కగా ఆలపించారు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ ని కంపోజ్ చేశారు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ తో తన అభిమానులతో పాటు మహేష్ ఫ్యాన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది రష్మిక. జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపి సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదలవనుంది.
సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర,తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి., ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com