రామ్ చరణ్ దత్త పుత్రుడు ఇతడే
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసనలు పెళ్లి చేసుకుని నాలుగేళ్లు అవుతుంది. చరణ్ - ఉపాసన ఇద్దరూ తమ కెరీర్ లో బిజీగా ఉండడం వలనో మరే కారణం వలనో ఇప్పటి వరకు ఈ దంపతులు శుభవార్త చెప్పలేదు. అదేనండి పిల్లల గురించి..! అయితే...ఈ దంపతులు తమకు పిల్లలు లేరు అని ఫీలవ్వడం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే...రామ్ చరణ్ బ్రాట్ అనే కుక్క పిల్లను పెంచుకుంటున్నాడు. ఈ బ్రాట్ నే తన కొడుకుగా చూసుకుంటున్నాడు చరణ్.
ఇది నిజంగా నిజం. ఈ విషయాన్ని రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా తెలియచేస్తూ...బ్రాట్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేసారు. అంతే కాదండోయ్...మై సన్ బ్రాట్ నిన్న సాయంత్రం ధృవ సెట్ కి వచ్చాడు. షూటింగ్ పూర్తయ్యే వరకు అంటే ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు నాతోనే ఉన్నాడు అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. అది చరణ్ దత్తపుత్రుడి స్టోరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout