పాయల్‌కు కాబోయే భర్త అతడే! కానీ...
Send us your feedback to audioarticles@vaarta.com
పాయల్ రాజ్‌పుత్‌కు కాబోయే భర్త ఎవరో తెలుసా? సౌరభ్ ధింగ్రా. పాయల్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు అతడు తెలిసే వుంటాడు. హీరోయిన్‌తో ఫిల్మ్ ఫంక్షన్స్, షూటింగ్స్‌కు అటెండ్ అవుతూ వుంటాడు. హైదరాబాద్‌లో ఇద్దరు సేమ్ ఫ్లాట్‌లో స్టే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇద్దరు క్లోజ్‌గా వున్న ఫొటోలు చాలా వున్నాయి. అంతకు ముందు వీళ్ళిద్దరూ ముంబైలో వుండేవాళ్ళు. గతంలో సౌరభ్ ధింగ్రాతో మీ రిలేషన్షిప్ ఏంటని అడిగితే జస్ట్ ఫ్రెండ్ అని చెప్పేది. ఇప్పుడు సౌరభ్ నా బాయ్‌ఫ్రెండ్ అని కన్ఫర్మ్ చేసింది. అతడిని పెళ్ళి చేసుంటానని చెప్పింది.
Also Read: టెర్రరిస్ట్‌గా సమంత యాక్టింగ్‌పై సెలబ్రిటీల రియాక్షన్
రీసెంట్గా సౌరభ్ మదర్ అనితా మృతి చెందారు. కరోనా వైరస్ ప్రాణాలు బలి తీసుకుంది. అనితా మరణంతో పాయల్ రాజ్‌పుత్ తీవ్రంగా కలత చెందింది. గట్టిగా ఏడ్వాలని వుందని చెప్పుకొచ్చింది. అనితా ఆంటీతో వున్న అనుబంధం గురించి చెబుతూ, పెళ్ళి మాట బయటపెట్టింది. సౌరభ్ ధింగ్రా ఇంట్లో, మా ఇంట్లో మా రిలేషన్షిప్ గురించి తెలుసని స్పష్టం చేసింది. పాయల్ చెప్పినదాన్ని బట్టి ఇద్దరి ఇళ్ళల్లో పెళ్ళికి ఎటువంటి అడ్డంకులు లేవు. అందరు హ్యాపీ. కానీ, ఇప్పుడు అనితా ఆంటీ మా పెళ్ళిని చూడలేదని పాయల్ బాధపడుతోంది. అదొక్కటే రిగ్రెట్ అని చెప్పింది. అంతా ఓపెన్ గా మాట్లాడింది కానీ, ఎప్పుడు పెళ్ళి చేసుకుంటుందో చెప్పలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com