మెగా హీరోలు అందరిలో ఆయనే బెస్ట్ - కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
అందం, అభినయం...ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కథానాయికల్లో ఒకరు కాజల్. లక్ష్మీ కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ తాజాగా నటించిన చిత్రం ఖైదీ నెం 150. మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల గ్యాప్ తరువాత నటించిన ఖైదీ నెం 150 చిత్రంలో కాజల్ కథానాయిక గా నటించింది. తనయుడు చరణ్ తో మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో నటించిన కాజల్ ఇప్పుడు చిరంజీవితో ఖైదీ నెం 150 లో నటించడం విశేషం. సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఖైదీ నెం 150 చిత్రం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ తో సక్సస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా కథానాయిక కాజల్ తో ఇంటర్ వ్యూ మీకోసం..!
చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150లో నటించారు కదా..! ఎలా ఫీలవుతున్నారు..?
లెజెండ్ చిరంజీవి గారితో వర్క్ చేయడం ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. వెరీ నైస్ పర్సన్...చిరంజీవి గారితో నటించడం అనేది మాటల్లో చెప్పలేను అద్భుతమైన ఫీలింగ్.
మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్...లతో నటించారు కదా..! ఈ మెగా హీరోల్లో ఎవరు బెస్ట్ అనిపించారు..? ఎవరితో నటించడం కష్టం అనిపించింది..?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే.ఒకటి మాత్రం చెప్పగలను నా ఫేవరేట్ హీరో చిరంజీవి గారే బెస్ట్ (నవ్వుతూ...)
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా చిన్న క్యారెక్టర్ కదా..! అయినా మీరు ఈ సినిమా చేయడానికి కారణం..?
ఓరిజినల్ మూవీ కత్తి చూసాను. ఇందులో నా క్యారెక్టర్ చిన్న క్యారెక్టరే. అయితే...కొన్ని సినిమాలు మన కోసం చేయాలి. కొన్ని సినిమాలు ప్రేక్షకుల కోసం చేయాలి. అలా...ఈ సినిమాని ప్రేక్షకుల కోసం చేసాను.
ఈ సినిమాలో హీరోయిన్ గా మిమ్మల్నే ఎంచుకోవడానికి కారణం ఏమిటి అనుకుంటున్నారు..?
నన్నే ఎందుకు ఈ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ చేసారో నాకు తెలియదు. ఈ ప్రశ్న వినాయక్ గార్ని అడగాలి (నవ్వుతూ..) కాకపోతే కారణం ఏదైనా సరే నన్ను ఈ మూవీకి సెలెక్ట్ చేసినందుకు వెరీ హ్యాపీ.
చిరంజీవితో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది..?
చిరంజీవి గారు అమేజింగ్ డ్యాన్సర్. ఆయనతో డ్యాన్స్ చేయడం కోసం హార్డ్ వర్క్ చేసాను. ఆయన నాకు డ్యాన్స్ విషయంలో కొన్ని టిప్స్ ఇచ్చారు. చిరంజీవి గారితో వర్క్ చేస్తూ చాలా నేర్చుకున్నాను.
ఖైదీ నెం 150 ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకున్నారా..?
5 రోజుల్లో 106 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు. నేను నటించిన సినిమా 5 రోజుల్లోనే ఇంత కలెక్ట్ చేయడం వెరీ హ్యాపీ.
చరణ్ ని ఇప్పటి వరకు హీరోగా చూసారు ఇప్పుడు ప్రొడ్యూసర్ కదా..! నిర్మాత చరణ్ గురించి ఏం చెబుతారు..?
చరణ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫస్ట్ వెంచర్ ఈ భారీ ప్రాజెక్ట్ చేయడం హ్యపీ. చాలా ఫ్రొఫిషినల్ గా ఈ మూవీని ప్రొడ్యూస్ చేసారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
ఖైదీ నెం 150లో శంకర్, కత్తి శీను ఈ రెండు క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ నచ్చింది..?
ఒక విధంగా శంకర్ క్యారెక్టర్, మరో విధంగా కత్తి శీను క్యారెక్టర్...టోటల్ గా రెండు క్యారెక్టర్స్ నచ్చాయి.
చిరంజీవి, చరణ్ ఇద్దరితో కలిసి డ్యాన్స్ చేసారు కదా..ఆ టైమ్ లో ఎలా ఫీలయ్యారు..?
నా కెరీర్ లో అది ఖజరారే మూమెంట్..! లైఫ్ లో ఎప్పటికీ మరచిపోలేను.
చిరంజీవితో సెట్స్ లో ఉన్నప్పుడు ఎక్కువుగా ఏ విషయాల గురించి డిష్కస్ చేసేవారు...?
చిరంజీవి గారితో వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్..ఎక్కువుగా ప్రొఫిషన్ గురించే మాట్లాడుకునేవాళ్లం. ఫుడ్, ట్రావెలింగ్ గురించి మాట్లాడేదాన్ని.
తెలుగులో తక్కువ సినిమాలు చేయడానికి కారణం..?
సంవత్సరానికి ఐదు సినిమాలు చేస్తుంటే అందులో రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాను. మిగిలిన మూడు వేరే లాంగ్వేజెస్ లో చేస్తున్నాను.అంటే 50% తెలుగు మూవీస్ చేస్తున్నాను అలాంటప్పుడు తెలుగులో తక్కువ సినిమాలు చేయడం ఎలా అవుతుంది.
లాస్ట్ ఇయర్ మీరు నటించిన జనతా గ్యారేజ్, ఇప్పుడు ఖైదీ నెం 150 100 కోట్లకు పైగా వసూలు చేయడం ఎలా ఫీలవుతున్నారు..?
జనతా గ్యారేజ్ లో నేను స్పెషల్ సాంగే చేసాను. అయినా జనతా గ్యారేజ్ అంత కలెక్ట్ చేసినందుకు నాకు క్రెడిట్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
ఐటం సాంగ్స్ చేయడానికి రెడీనా..?
ఐటం సాంగ్స్ కోసం ప్రత్యేకించి ప్లాన్స్ ఏమీ లేవు. గ్రేట్ ఆఫర్ వస్తే ఆలోచిస్తాను.
లక్ష్మీ కళ్యాణంతో కెరీర్ ప్రారంభించారు...ఇంతకీ మీ కళ్యాణం ఎప్పుడు..?
నా వయసు 30 ఏళ్లే. త్వరలో చేసుకుంటాను అయితే ప్రస్తుతం ఆ ఆలోచన లేదు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
రానా హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చేస్తున్నాను. ఆతర్వాత అజిత్ తో ఓ మూవీ, విజయ్ తో ఓ మూవీ చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments