నాకు ఎప్పటికీ భాయ్ ఫ్రెండ్ ఆయనే..: అనసూయ
Send us your feedback to audioarticles@vaarta.com
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇవాళ ఏ రేంజ్ సంపాదించుకుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాప్ యాంకర్లలో ఒకరుగా నిలిచింది. టీవీ షోలకు యాంకర్‌గా ఉన్న ఈ హాట్ భామ.. జడ్జిగా ఎదిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో ఇంటికే పరిమితం అయిన అనసూయ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోవర్స్, నెటిజన్లతో నిత్యం టచ్‌లోకి వస్తోంది. ఇటీవలే పుట్టిన రోజు సందర్భంగా ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఏ రేంజ్లో రిప్లయ్ ఇచ్చిందో తెలిసిందే. అయితే తాజాగా.. మరోసారి నెటిజన్లతో ఇంటరాక్ట్ అయ్యింది.
అభిమాని : మీ భర్తే మీ ఫస్ట్ బాయ్‌ఫ్రెండ్ అంతేగా..!? (దంపతుల ఫొటోని షేర్ చేసిన ఫ్యాన్)
అనసూయ : ఎస్.. నా మొదటి, రెండో, మూడో.. ఇప్పుడు, భవిష్యత్తులో కూడా ఆయనే నా బాయ్‌ఫ్రెండ్.
అభిమాని : మీరు షో, నటనా పరంగా రాజీ పడ్డారా..!?
అనసూయ : విలువల విషయంలో తాను ఎక్కడా రాజీ పడకుండా అవకాశాలను వినియోగించుకున్నాను. మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యమని, ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి
అభిమాని : పవన్ కల్యాణ్ సినిమాలో ఎప్పుడు నటిస్తారు!?
అనసూయ : నేను కూడా ఆయన సినిమాలో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను (వకీల్ సాబ్, క్రిష్-పవన్ కాంబో మూవీలో అనసూయను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి)
అభిమాని : మీ లాంటి అమ్మాయి నాకు లవర్‌గా రావాలని దీవించండి..!?
అనసూయ : అది కొంచెం కష్టమే. ఎందుకంటే నేను సింగిల్ యూనిక్ పీస్. నా లాంటి కొంచెం మంచి అమ్మాయి రావాలని కోరకుంటున్నా.
అభిమాని : మేకప్ లేకుండా అందంగా ఉంటారని మీరు నిరూపించారు
అనసూయ : థ్యాంక్స్
అభిమాని : లాక్ డౌన్ తర్వాత ఏం చేస్తారు..!?
అనసూయ : లాక్డౌన్ కారణంగా 3 కిలోల వరకు బరువు పెరిగాను. ఇది పూర్తిగా ఎత్తేసిన తర్వాత మొట్ట మొదట తిరుమల దర్శనం చేసుకుంటాను అని అభిమానులతో హాట్ అనసూయ ముచ్చటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments