2016 గూగూల్ హీరో ఇతనే..!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో బాగా ఏక్టీవ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. అందుకనే అనుకుంట...ఫేస్ బుక్ లో హైయ్యస్ట్ ఫాలోవర్స్ ఉన్న సౌత్ స్టార్ గా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసారు. అలాగే ట్విట్టర్ లో ఫాస్ట్ గా 1 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న హీరో కూడా అల్లు అర్జునే. అందుకనే బన్నిని అభిమానులు కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటారు.
ఇదిలా ఉంటే...ఈ సంవత్సరం గూగూల్ లో అత్యథికంగా సెర్చ్ చేసిన హీరోగా బన్ని మరో రికార్డ్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ సంవత్సరంలో రిలీజైన అల్లు అర్జున్ చిత్రం సరైనోడు సంచలన విజయం సాధించి టాప్ 5 బ్లాక్ బష్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అలాగే కేరళలో యోధవు టైటిల్ తో డబ్ అయిన ఈ చిత్రం అక్కడ కూడా సక్సెస్ సాధించింది. ఈ సంవత్సరంలోనే అల్లు అర్జున్ కి కూతురు పుట్టడం, అలాగే తమిళ్ లో కూడా బన్ని ఓ చిత్రాన్ని ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com