అఖిల్ సెకండ్ మూవీ డైరెక్టర్ ఇతనే...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్...తొలి చిత్రం అఖిల్ ఆశించిన విజయాన్ని అందుకోలేక ఫెయిల్ అయినా...అఖిల్ మాత్రం డాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకుని సక్సెస్ అయ్యాడు. ఇక ఈసారి ఎలాగైనా సరే...హిట్ కొట్టాల్సిందే అనే పట్టుదలతో ఉన్నాడు. అఖిల్ సెకండ్ మూవీగా బాలీవుడ్ హిట్ మూవీ యే జవానీ హే దివానీ రీమేక్ చేయనున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రంలో అఖిల్ సరసన హీరోయిన్ అలియా భట్ ని ఫైనల్ చేసారట. ప్రస్తుతం సోగ్గాడు రిలీజ్, మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ బిజీలో ఉన్న నాగ్ సంక్రాంతి తర్వాత అఖిల్ సెకండ్ మూవీ వర్క్ స్టార్ట్ చేస్తారట.ఇక.. నాగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అఖిల్ సెకండ్ మూవీకి డైరెక్టర్ గా ఊపిరి డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని ఫైనల్ చేసినట్టు సమాచారం. మరి..ఇది నిజమా...కాదా..అనేది సంక్రాంతి తర్వాత తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com