పవన్ లోని రెండు గుణాలు ఆ స్టార్స్ లోనూ ఉన్నాయట
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో రెండే రెండు సినిమాల్లో నటించి.. ముచ్చటగా మూడో సినిమాతో ఏకంగా పవన్ కల్యాణ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది కీర్తి సురేష్. అజ్ఞాతవాసి`లో కీర్తి అమాయకంగా కనిపిస్తూనే బోలెడంత కామెడీని పండించిందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది కీర్తి.
ఈ సినిమాలో పవన్ పక్కన కలిసి నటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే.. పవన్ చాలా సరదాగా ఉంటారని, అందరినీ నవ్విస్తూ ఉంటారని.. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ పూర్తి చేసామని కీర్తి పేర్కొన్నారు. 'గ్యాంగ్' తమిళ వెర్షన్ ప్రమోషన్లో.. పవన్, అజిత్, విజయ్ ఈ ముగ్గురిలో ఉండే సారూప్యత గురించి తమిళ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు, “ పవన్లో ఉండే రెండు గుణాలు విజయ్, అజిత్లోనూ ఉన్నాయి. పవన్, అజిత్ బాడీ లాంగ్వేజ్ ఒకలాగే ఉంటుంది. అలాగే పవన్, విజయ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది” అని బదులిచ్చారు. అజ్ఞాతవాసి` ఈ నెల 10న విడుదల కానున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com