పవన్ తో మూడోసారీ మార్చేసాడు

  • IndiaGlitz, [Saturday,May 07 2016]

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి సినిమా చేస్తున్న తొలి ద‌ర్శ‌కుడుగా క్రెడిట్ సొంతం చేసుకున్నాడు ఎస్‌.జె.సూర్య‌. 15 ఏళ్ల క్రితం ప‌వ‌న్‌తో 'ఖుషి' లాంటి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని స‌క్సెస్‌ఫుల్‌గా అందించిన సూర్య‌, ఆ త‌రువాత 'పులి' లాంటి డిజాస్ట‌ర్‌ని కూడా అందించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడేమో అదే ప‌వ‌న్‌తో ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ల‌వ్ స్టోరీని తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు సూర్య‌.

విశేష‌మేమిటంటే.. ప‌వ‌న్‌తో సూర్య క‌లిసి ప‌నిచేసిన ప్ర‌తిసారీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని మార్చేస్తుండ‌డం. 'ఖుషి' కోసం మ‌ణిశ‌ర్మ‌ని సంగీత ద‌ర్శ‌కుడుగా ఎంచుకున్న ఎస్‌.జె.సూర్య‌, 'పులి' కోసం ఎ.ఆర్‌.రెహ‌మ‌న్‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడేమో అనూప్ రూబెన్స్‌ని స్వ‌ర‌క‌ర్త‌గా తీసుకున్నాడు. 'ఖుషి' మ్యూజిక‌ల్‌గా ఈనాటికీ సెన్సేష‌న్ అయితే.. 'పులి' పాట‌ల‌న్ని దాదాపుగా మ‌ర‌చిపోయారు. కొత్త చిత్రంలో అయినా గుర్తుండిపోయేలా పాట‌లుంటాయో లేదో చూడాలి.

More News

'ఆర్య' వన్ సైడ్ లవ్ కి 12 ఏళ్లు

వన్ సైడ్ లవ్ లోని గొప్పతనాన్ని చెబుతూ ప్రేక్షకులకి సరికొత్త ప్రేమకథని పరిచయం చేసిన చిత్రం 'ఆర్య'.

డబ్బింగ్ చెబుతున్న 'జెంటిల్ మన్'

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జెంటిల్ మన్'.మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.'అష్టా చమ్మా' తర్వాత నాని,మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది.

బ్ర‌హ్మోత్స‌వం సాంగ్ మేకింగ్ రిలీజ్...

సూపర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నభారీ చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో నిర్మిస్తుంది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించిన బ్ర‌హ్మోత్స‌వం ఆడియోను ఈనెల 7న రిలీజ్ చేస్తున్నారు.

బాహుబలి మాయలో కుర్రహీరో

'వినవయ్యా రామయ్య'ఫేమ్ నాగ అన్వేష్ రెండో సినిమాకు రంగం సిద్దమైంది.ఎంతో కాలంగా సరైన కథ కోసం ఎదురుచూసిన అన్వేష్ చివరకు ఓ కథను ఒకే చేసి ఆరు నెలలుగా దాని పై వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

జూన్ మూడ‌వ వారంలో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నజ‌క్క‌న్న టాకీ పూర్తి

వరుసగా విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని సందడి చేస్తున్న సునీల్ హీరోగా... మన్నార్ చోప్రా హీరోయిన్ గా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.