పవన్ తో మూడోసారీ మార్చేసాడు
- IndiaGlitz, [Saturday,May 07 2016]
పవన్ కళ్యాణ్‌తో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్న తొలి దర్శకుడుగా క్రెడిట్ సొంతం చేసుకున్నాడు ఎస్.జె.సూర్య. 15 ఏళ్ల క్రితం పవన్‌తో 'ఖుషి' లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ని సక్సెస్‌ఫుల్‌గా అందించిన సూర్య, ఆ తరువాత 'పులి' లాంటి డిజాస్టర్‌ని కూడా అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో అదే పవన్‌తో ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ లవ్ స్టోరీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు సూర్య.
విశేషమేమిటంటే.. పవన్‌తో సూర్య కలిసి పనిచేసిన ప్రతిసారీ మ్యూజిక్ డైరెక్టర్ని మార్చేస్తుండడం. 'ఖుషి' కోసం మణిశర్మని సంగీత దర్శకుడుగా ఎంచుకున్న ఎస్.జె.సూర్య, 'పులి' కోసం ఎ.ఆర్.రెహమన్ని మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడేమో అనూప్ రూబెన్స్‌ని స్వరకర్తగా తీసుకున్నాడు. 'ఖుషి' మ్యూజికల్‌గా ఈనాటికీ సెన్సేషన్ అయితే.. 'పులి' పాటలన్ని దాదాపుగా మరచిపోయారు. కొత్త చిత్రంలో అయినా గుర్తుండిపోయేలా పాటలుంటాయో లేదో చూడాలి.