తాగొచ్చి దుర్భాషలాడాడు.. అందుకే ఓటర్‌ను కొట్టాను.. వైసీపీ అభ్యర్థి క్లారిటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ కేంద్రంలో ఓటరుపై చేయి చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే శివకుమార్‌ను గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఆయన ఈ ఘటనపై స్పందించారు. అసలు ఏం జరిగిందో చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు.
తెనాలి ఐతానగర్‌లో భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లానని.. అక్కడ ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను దూషించినట్లు శివకుమార్ ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై చాలా ధ్వేషంతో రగిలిపోయాడన్నారు. చాలా శాడిజంగా దుర్భాషలాడాడని, భార్య ముందే తనను అసభ్యంగా ధూషించాడని తెలిపారు. బూత్‌లోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడని.. గొట్టిముక్కల సుధాకర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ వ్యక్తి అన్నారు. నువ్వు అసలు కమ్మోడివేనా అంటూ అసభ్యంగా మాట్లాడాడని.. పోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో అందరి ముందు చాలా దురుసుగా ప్రవర్తించాడన్నారు. పోలింగ్ బూత్‌లో ఉదయం నుండి అతడు హల్‌చల్ చేస్తున్నట్లు అక్కడి ఓటర్లే చెప్పారని వివరించారు. అతడు బెంగుళూరులో ఉంటూ ఇక్కడకు వచ్చి హడావిడి చేశాడని.. టీడీపీ-జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో వాళ్ల మనుషులను పిలిపించి వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని శివకుమార్ క్లారిటీ ఇచ్చారు.
కాగా తెనాలి ఐతానగర్‌లో ఈ ఉదయం ఓ పోలింగ్ బూత్ వద్దకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వచ్చారు. ఆయన బూతలోకి వెళుతుండగా, క్యూలైన్‌లో ఉన్న గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి అభ్యంతరం చెప్పారు. క్యూ లైన్ నుంచి కాకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడం ఏంటని ఎమ్మెల్యేని నిలదీశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే... సుధాకర్‌పై చేయిచేసుకున్నారు. చెంప చెళ్లుమనిపించారు. ఆ ఓటరు కూడా ఎమ్మెల్యే చెంపపై కొట్టారు .దీంతో ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్‌పై దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈసీ సీరియస్ అయింది. మరోవైపు చంద్రబాబు కూడా ఈ ఘటనపై ఈసీ ఫిర్యాదుచేశారు. దీంతో పోలింగ్ అయ్యే వరకు ఎమ్మెల్యేను గృహనిర్బంధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout