Youtuber Nani:దండం పెట్టి చెబుతున్నా.. తాను ఏ తప్పు చేయలేదు: యూట్యూబర్ నాని

  • IndiaGlitz, [Friday,November 24 2023]

విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై యూట్యూబర్ లోకల్ బాయ్ నాని స్పందించాడు. ఈ ప్రమాదానికి తనకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఈ ఘటన ఎలా జరిగిందో అందులో తన పేరు ఎందుకు వినిపిస్తోందో తెలియడంలేదని వాపోయాడు. కొంతమంది గంగపుత్ర సోదరులు కూడా తనపై నిరాధార ఆరోపణలు చేయడం బాధించిందని ఆవేదన వ్యక్తంచేశాడు. మత్స్యకార సోదరులకు, యూట్యూబర్లకు దండం పెట్టి చెబుతున్నానని తన జీవితాన్ని నాశనం చేయొద్దని కోరాడు. ఈనెల 19 రాత్రి ఓ హోటల్‌లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చానని.. 9:46 నిమిషాలకు ప్రమాదం జరిగిందని ఫోన్ రావడంతో వెంటనే అక్కడికి వెళ్లానని తెలిపాడు. పార్టీలో తాను డ్రింక్ చేయడం వల్ల సేవ్ చేయకలేకపోయానని పేర్కొన్నాడు.

అయితే ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు సహాయం అందుతుందని ఉద్దేశంతోనే వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టానని చెప్పాడు. మరుసటి రోజు సోమవారం ఉదయం పోలీసులు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని పిలిచారని.. వెళ్లిన వెంటనే తాను ఫలానా హోటల్‌లో ఉన్నానని చెప్పానన్నాడు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి సీసీటీవీ ఫుటేజీలు తీసుకొచ్చారని.. అందులో తాను కనిపించడంతో తనకు ఈ ప్రమాదంతో సంబంధంలేదని వాళ్లే చెప్పారన్నాడు. అయినా కూడా తనను అక్కడే నాలుగు రోజుల పాటు స్టేషన్‌లోనే ఉంచారన్నాడు. హైకోర్టుకు రావడంతోనే తనను వదిలిపెట్టారని.. కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చాడు.

వైజాగ్ వెళ్లాక తనపై ఎటాక్ కుడా జరగొచ్చని.. ఇప్పటికే తన అన్నపై రాళ్లతో దాడి చేశారని వాపోయాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తెలిపాడు. కాగా బోట్ల దగ్ధం కేసులో నాని కుటుంబసభ్యులు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

More News

CM Jagan:బెయిల్ రద్దుపై సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి కోర్టుల నుంచి నోటీసుల మీద నోటీసులు జారీ అవుతున్నాయి. తాజాగా అక్రమాస్తుల కేసులో

Bhagwant Kesari:బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేసిన 'భగవంత్ కేసరి'..

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.

Bigg Boss Telugu 7 : గౌతమ్‌ను చంపలేకపోయిన శివాజీ.. కిల్లర్‌గా ప్రియాంక, శోభాశెట్టి కోసం తొండాట

బిగ్‌బాస్ 7 తెలుగు ఉత్కంఠగా సాగుతున్న సంగతి తెలిసిందే.  మిసెస్ బిగ్‌బాస్ దారుణ హత్యకు గురికావడంతో ఆమెను చంపింది ఎవరో తెలుసుకోవాలంటూ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు.

KCR:పరేడ్ గ్రౌండ్స్‌లో కేసీఆర్ సభ రద్దు.. ఎందుకంటే..?

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. ప్రచారానికి కూడా కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది.

Modi and Amit Shah:తెలంగాణలో బీజేపీ దూకుడు.. మోదీ, అమిత్ షా రాష్ట్రంలోనే మకాం..

తెలంగాణ ఎన్నికలు చివరి దశకు చేరడంతో బీజేపీ అగ్రనేతలు ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా,