Youtuber Nani:దండం పెట్టి చెబుతున్నా.. తాను ఏ తప్పు చేయలేదు: యూట్యూబర్ నాని
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై యూట్యూబర్ లోకల్ బాయ్ నాని స్పందించాడు. ఈ ప్రమాదానికి తనకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఈ ఘటన ఎలా జరిగిందో అందులో తన పేరు ఎందుకు వినిపిస్తోందో తెలియడంలేదని వాపోయాడు. కొంతమంది గంగపుత్ర సోదరులు కూడా తనపై నిరాధార ఆరోపణలు చేయడం బాధించిందని ఆవేదన వ్యక్తంచేశాడు. మత్స్యకార సోదరులకు, యూట్యూబర్లకు దండం పెట్టి చెబుతున్నానని తన జీవితాన్ని నాశనం చేయొద్దని కోరాడు. ఈనెల 19 రాత్రి ఓ హోటల్‌లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చానని.. 9:46 నిమిషాలకు ప్రమాదం జరిగిందని ఫోన్ రావడంతో వెంటనే అక్కడికి వెళ్లానని తెలిపాడు. పార్టీలో తాను డ్రింక్ చేయడం వల్ల సేవ్ చేయకలేకపోయానని పేర్కొన్నాడు.
అయితే ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు సహాయం అందుతుందని ఉద్దేశంతోనే వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టానని చెప్పాడు. మరుసటి రోజు సోమవారం ఉదయం పోలీసులు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని పిలిచారని.. వెళ్లిన వెంటనే తాను ఫలానా హోటల్‌లో ఉన్నానని చెప్పానన్నాడు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి సీసీటీవీ ఫుటేజీలు తీసుకొచ్చారని.. అందులో తాను కనిపించడంతో తనకు ఈ ప్రమాదంతో సంబంధంలేదని వాళ్లే చెప్పారన్నాడు. అయినా కూడా తనను అక్కడే నాలుగు రోజుల పాటు స్టేషన్‌లోనే ఉంచారన్నాడు. హైకోర్టుకు రావడంతోనే తనను వదిలిపెట్టారని.. కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చాడు.
వైజాగ్ వెళ్లాక తనపై ఎటాక్ కుడా జరగొచ్చని.. ఇప్పటికే తన అన్నపై రాళ్లతో దాడి చేశారని వాపోయాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తెలిపాడు. కాగా బోట్ల దగ్ధం కేసులో నాని కుటుంబసభ్యులు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com