close
Choose your channels

చందమామపై స్థలాన్ని కొని భార్యకు కానుకిచ్చాడు..

Sunday, December 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భార్యకు పెళ్లిరోజు కానుక ఏమివ్వాలా? అని ఓ భర్త ఆలోచించాడు. ఏముంటుంది.. ఏ బంగారు నెక్లెస్సో.. మరి సౌండ్ పార్టీ అయితే డైమండ్ నెక్లెస్.. లేదంటే ఎక్కడైనా ఇల్లు.. లేదంటే ఖరీదైన కారు.. ఇలా భూమిపై మాత్రమే ఏమివ్వగలమో ఆలోచిస్తుంటారు.. కానీ అతను మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. తన భార్యకు ఎవరూ ఇవ్వని కానుకని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. భూమిపై ఏది ఇవ్వాలనుకున్నా అది ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు అందులో ప్రత్యేకమంటూ ఏమీ ఉండదు.

అందుకే ఆయన చంద్రుడిపై మూడు ఎకరాల ల్యాండ్ కొని భార్యకు పెళ్లి రోజు కానుకను అందజేశాడు. ఢిల్లీకి చెందిన ధర్మేంద్ర అనిజకు సప్నాతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. డిసెంబర్ 24 వారి పెళ్లిరోజు. ఈ సందర్భంగా తాను ఎంతగానో ప్రేమించే భార్య కోసం ఏదైనా అద్భుతమైన బహుమతి ఇవ్వాలని ధర్మేంద్ర ఆలోచించారు. అయితే చాలా మంది ఈ భూమి మీద ఉన్న కార్లు, బంగారం వంటి వాటిని బహుమతులుగా ఇస్తూ ఉంటారని, అందువల్ల ఏదైనా ప్రత్యేకత చూపించాలని అనుకున్నానన్నారు. అందుకే చంద్రునిపై మూడెకరాల స్థలాన్ని కొన్నానని చెప్పారు. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ద్వారా ఈ స్థలాన్ని కొన్నానని, దీనికి అవసరమైన ప్రక్రియ పూర్తి కావడానికి ఒక సంవత్సరం పట్టిందని ధర్మేంద్ర తెలిపారు.

తన భర్త తనకు ఇచ్చిన బహుమతి గురించి సప్నా అనిజ మాట్లాడుతూ... తనకు తన భర్త అనూహ్యమైన బహుమతి ఇచ్చారని తెలిపారు. ఇలాంటి బహుమతిని తన భర్త ఇస్తారని తాను ఎన్నడూ ఊహించలేదని వెల్లడించింది. చంద్రునిపై స్థలాన్ని బహుమతిగా పొందడం తనకు చాలా సంతోషకరమని చెప్పారు. ఈ బహుమతిని తనకు తన భర్త ప్రొఫెషనల్ ఈవెంట్ ఆర్గనైజర్లతో వైభవంగా ఏర్పాట్లు చేయించి, పార్టీ ఇచ్చి ఆ బహుమతిని అందజేసినట్టు తెలిపారు. నమ్మశక్యం కానటువంటి సెట్టింగ్స్ వేసినట్లు తెలిపారు. నిజంగా చంద్రునిపైనే ఉన్నట్టు అనుభూతి కలిగిందన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment