Biryani: లక్ అంటే ఇదే.. బిర్యానీ తిన్నాడు.. రూ.7లక్షల కారు గెలుచుకున్నాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
అదృష్టం అంటే ఇదే కదా. ఒక్క బిర్యానీ తింటే లక్షల రూపాయలు విలువ చేసే కారు గిఫ్ట్‌గా వచ్చింది. ఒక్కోసారి అదృష్ట దేవత అనుకోని విధంగా కొంతమందిని పలకరిస్తూ ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి ఇంటి తలుపును ఇలాగే కొట్టింది. ఆకలిగా ఉందని బిర్యానీ తిన్నందుకు కారును కానుకగా అందించింది. దీంతో కొత్త సంవత్సరం నాడు అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అసలు ఏంటి ఇదంతా అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.
తిరుపతికి చెందిన రోబో హోటల్ నిర్వాహకులు బిర్యానీ లక్కీ డ్రా నిర్వహించారు. గత సెప్టెంబర్ నెలలో ఈ స్కీం ప్రవేశ పెట్టారు. హోటల్లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికి ఓ కూపన్ అందజేశారు. అలా సుమారు 23వేలకు పైగా కూపన్లు చేరాయి. కొత్త ఏడాదిని పురస్కరించుకొని ఆదివారం రాత్రి హోటల్లో లక్కీ డ్రా కూపన్ తీశారు. ఇందులో నగరానికి చెందిన రాహుల్ అనే వ్యక్తికి అదృష్టం వరించింది. ఆయనకు ఏడు లక్షల రూపాయలు విలువ చేసే నిస్సాన్ మ్యాగ్నెట్ కారు ఉచితంగా లభించింది. హోటల్ అధినేతలు స్వయంగా అతడికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి కారును అందజేశారు. అలాగే మరికొంత మందికి ఇంకొన్ని బహుమతులు కూడా ఇచ్చారు.
తమ హోటల్ నగరవాసులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతోనే ఈ లక్కీ డ్రా స్కీం ప్రవేశపెట్టామని నిర్వాహకులు తెలిపారు. తక్కువ ధరలకు నాణ్యమైన వంటకాలు తమ రోబో హోటల్లో అందిస్తున్నామని వెల్లడించారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు రుచితో పాటు ఇలాంటి మరిన్ని స్కీములు ఇకపై కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. మీకు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఇలాంటి అదృష్టం వరించాలని కోరుకోండి. మీకు దగ్గర్లోని హోటల్స్, రెస్టారెంట్స్, షోరూమ్స్‌లలో ఎక్కడైనా ఇలాంటి లక్కీ డ్రా కూపన్లు అందిస్తున్నారేమో తెలుసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com