Biryani: లక్‌ అంటే ఇదే.. బిర్యానీ తిన్నాడు.. రూ.7లక్షల కారు గెలుచుకున్నాడు..

  • IndiaGlitz, [Monday,January 01 2024]

అదృష్టం అంటే ఇదే కదా. ఒక్క బిర్యానీ తింటే లక్షల రూపాయలు విలువ చేసే కారు గిఫ్ట్‌గా వచ్చింది. ఒక్కోసారి అదృష్ట దేవత అనుకోని విధంగా కొంతమందిని పలకరిస్తూ ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి ఇంటి తలుపును ఇలాగే కొట్టింది. ఆకలిగా ఉందని బిర్యానీ తిన్నందుకు కారును కానుకగా అందించింది. దీంతో కొత్త సంవత్సరం నాడు అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అసలు ఏంటి ఇదంతా అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.

తిరుపతికి చెందిన రోబో హోటల్ నిర్వాహకులు బిర్యానీ లక్కీ డ్రా నిర్వహించారు. గత సెప్టెంబర్ నెలలో ఈ స్కీం ప్రవేశ పెట్టారు. హోటల్‌లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికి ఓ కూపన్ అందజేశారు. అలా సుమారు 23వేలకు పైగా కూపన్లు చేరాయి. కొత్త ఏడాదిని పురస్కరించుకొని ఆదివారం రాత్రి హోటల్‌లో లక్కీ డ్రా కూపన్ తీశారు. ఇందులో నగరానికి చెందిన రాహుల్ అనే వ్యక్తికి అదృష్టం వరించింది. ఆయనకు ఏడు లక్షల రూపాయలు విలువ చేసే నిస్సాన్ మ్యాగ్నెట్ కారు ఉచితంగా లభించింది. హోటల్ అధినేతలు స్వయంగా అతడికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి కారును అందజేశారు. అలాగే మరికొంత మందికి ఇంకొన్ని బహుమతులు కూడా ఇచ్చారు.

తమ హోటల్ నగరవాసులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతోనే ఈ లక్కీ డ్రా స్కీం ప్రవేశపెట్టామని నిర్వాహకులు తెలిపారు. తక్కువ ధరలకు నాణ్యమైన వంటకాలు తమ రోబో హోటల్లో అందిస్తున్నామని వెల్లడించారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు రుచితో పాటు ఇలాంటి మరిన్ని స్కీములు ఇకపై కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. మీకు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఇలాంటి అదృష్టం వరించాలని కోరుకోండి. మీకు దగ్గర్లోని హోటల్స్, రెస్టారెంట్స్, షోరూమ్స్‌లలో ఎక్కడైనా ఇలాంటి లక్కీ డ్రా కూపన్‌లు అందిస్తున్నారేమో తెలుసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

More News

PSLV-C58 XPoSat: ఇస్రో న్యూ ఇయర్ గిఫ్ట్.. ఎక్స్‌పోశాట్ ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. దేశ ప్రజలకు నూతన సంవత్సర కానుకను అందించింది. కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. అగ్రరాజ్యం అమెరికా

మంత్రి రజినీ కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తల రాళ్ల దాడి..

కొత్త సంవత్సరంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. అర్థరాత్రి పూట గుంటూరులో వీరంగం సృష్టించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్‌, మంత్రి విడదల రజినీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు.

KTR: యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉంటే హ్యాట్రిక్ కొట్టేవాళ్లం: కేటీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల అవుతోంది. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే తమ ఓటమిని ఇప్పటికీ గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Komati Reddy: సీఎం రేవంత్ రెడ్డి గురించి మంత్రి కోమటిరెడ్డి పోస్ట్ వైరల్

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొమ్మిదన్నరేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అంతకుముందు ఉప్పు నిప్పులుగా ఉండే నాయకులు

Devara:ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'దేవర' అప్టేడ్ వచ్చేసింది..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR) అభిమానులకు న్యూ ఇయర్ ట్రీట్ వచ్చేసింది. పాన్ ఇండియా మూవీ 'దేవర' సినిమా నుంచి అదిరిపోయే అప్టేడ్ వచ్చింది.