మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌కు హెచ్‌బీవో స్పెష‌ల్ సర్‌ఫ్రైజ్

  • IndiaGlitz, [Saturday,February 08 2020]

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌కు సూపర్ మ్యాన్ బొమ్మలన్నా, మాస్కులు అన్నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమన్న సంగతి తెలిసిందే. సూపర్ హీరోల సినిమాలను వరుణ్ ఒక్కటి వదలకుండా చూస్తారు. అది గుర్తించే హెచ్‌బీఓ ఇండియా వ‌రుణ్‌కు ఇష్టమైన డీసీ కామిక్ ఆట బొమ్మలను బహుమతిగా ప్రెజెంట్ చేసింది. బాట్ మ్యాన్ మాస్క్, వండర్ వుమెన్, మాస్కుల్ని, ఓ కారు బొమ్మను ఈ సంస్థ పంపించింది. ఈ విషయాన్ని వరుణ్ త‌న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో షేర్ చేస్తూ హెబీఓ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా.. ఇటీవ‌లే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ‘గ‌ద్దల‌కొండ గ‌ణేశ్’ వంటి బ్లాక్ బ‌స్టర్‌ను అందుకొని అదే ఉత్సాహంతో ప్రస్తుతం త‌న త‌దుప‌రి సినిమా స‌న్నాహాలు ఉన్నారు. సిద్ధు ముద్దా, అల్లు వెంక‌టేశ్ నిర్మాత‌లుగా కిర‌ణ్ కొర్రపాటి ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కబోతుంది. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత‌మందిస్తున్నారు.