'సెవెన్' బ్లాక్‌బస్టర్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది - హీరో హవీష్
Send us your feedback to audioarticles@vaarta.com
హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నెల 5న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లతో మల్టీప్లెక్స్‌లలో సినిమా విడుదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 6న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హవీష్, అభిషేక్ నామా, నందితా శ్వేత, త్రిధా చౌదరి, పూజితా పొన్నాడ పాల్గొన్నారు.
హవీష్ మాట్లాడుతూ " బుధవారం (ఈ నెల 5) సాయంత్రం 7.30, 9.30 గంటలకు పెయిడ్ ప్రీమియర్ షోలతో సినిమా విడుదలవుతుంది. గురువారం రెగ్యులర్ రిలీజ్. నేను ఫస్ట్‌టైమ్ కథ విన్నప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో... ట్రైలర్ విడుదలయినప్పుడు అంతే ఎగ్జయిట్ అయ్యాను. సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి ట్రైలరే కారణం. ట్రైలర్ చూసే అభిషేక్ నామాగారు సినిమాపై ఆసక్తి చూపించారు. తర్వాత సినిమా చూసి కొన్నారు. నేను రెండేళ్ల క్రితం విన్న స్టోరీ లైన్, ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైలర్. ఇంత మంచి కథ అందించిన రమేష్ వర్మగారికి థాంక్స్. రమేష్ వర్మగారు కథ చెప్పిన తర్వాత 'నేనే ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్షన్, ప్రొడక్షన్ రెండూ కష్టమవుతుంది ఏమో. ఖర్చులో రాజీ పడకుండా సినిమా నిర్మించాలనుకుంటున్నా' అన్నారు. అప్పుడు ఆయనకు నిజార్ షఫీ పేరు సూచించాను. రమేష్ వర్మ కథకు నిజార్ షఫీ న్యాయం చేశాడు. ఆరుగురు అందమైన హీరోయిన్లు సినిమాలో నటించారు. అందరూ చాలా బాగా చేశారు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ చైతన్ భరద్వాజ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. మూడూ హిట్ అయ్యాయి. రీసెంట్గా రిలీజైన ప్రమోషనల్ సాంగ్‌కీ మంచి రెస్పాన్స్ వస్తోంది. టెర్రిఫిక్ రికార్డింగ్ ఇచ్చాడు. 'ఆర్ఎక్స్ 100' కంటే ముందు అతను మా సినిమాకు వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. సినిమా చూశాను. చాలా బాగా వచ్చిందనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది" అన్నారు.
అభిషేక్ నామా మాట్లాడుతూ " పెయిడ్ ప్రీమియర్లతో ఈ నెల 5న, బుధవారం సాయంత్రం మల్టీప్లెక్స్‌లలో 'సెవెన్' విడుదలవుతోంది. గురువారం ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదలవుతుంది. రమేష్ వర్మ గారు ఒకసారి సినిమా చూడమని కోరడంతో చూశా. నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకున్నాను. 'సెవెన్'లో కొత్త హవీష్‌ని చూస్తారు. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుంది. ఈ నెల 6న ప్రేక్షకులందరూ సినిమా చూసి బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నా" అన్నారు.
హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ " రెండు నెలలకు ఒకసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. నేను నటించిన సినిమాలు అన్ని విడుదలవుతున్నాయి. అన్నిటిలో ఈ 'సెవెన్' చాలా స్పెషల్. ఇందులో రమ్యగా నటించాను. ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఈజీగా చేసిన, నాకు నచ్చిన క్యారెక్టర్. డీసెంట్ సిటీ అమ్మాయిగా కనిపిస్తా. సినిమాలో రమ్య పాత్రకు చాలా వెయిట్ ఉంది. పోస్టర్లు, ట్రైయర్లు చూస్తే హోమ్లీగా, ఇన్నోసెంట్‌గా ఉన్నట్టు ఉంటుంది. కానీ, సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. 'రమ్య పాత్ర మీరే చేయాలి' అని రమేష్ వర్మగారు పట్టుబట్టారు. కథ విన్న తరవాత క్యారెక్టర్ వదులుకోవాలని అనిపించలేదు. నాకు ఇంత మంచి క్యారెక్టర్, సినిమా ఇచ్చిన రమేష్ వర్మగారికి థాంక్స్. ఈ సినిమా కంటే ముందు నిజార్ షఫీ నా ఫ్రెండ్. తను దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. నన్నే కాదు, నాతో పాటు సినిమాలో నటించిన హీరోయిన్లు అందరినీ అందంగా చూపించాడు. అందుకు నిజార్ షఫీకి థాంక్స్. హవీష్ లవ్లీ కోస్టార్. మంచి వ్యక్తి. తనతో పని చేయడం మంచి అనుభూతి. వాళ్ళ నాన్నగారు, ఫ్యామిలీ సినిమాలో నటించిన హీరోయిన్లు అందరినీ బాగా చూసుకున్నారు. విడుదలకు ముందు ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఇది. ప్రతి ఫ్రేములో ఒక హీరోయిన్ కనిపిస్తే కొంతమంది ప్రేక్షకులకు బోర్ కొట్టొచ్చు. మా సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. సో, బోర్ కొట్టదు" అన్నారు.
హీరోయిన్ త్రిధా చౌదరి మాట్లాడుతూ " ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. మంచి టీమ్‌తో పని చేశా. అందరినీ ఆకట్టుకునే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో ప్రేక్షకులు కొత్త త్రిధా చౌదరిని చూస్తారు. రొమాంటిక్ స్టోరీలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి" అన్నారు.
హీరోయిన్ పూజితా పొన్నాడ మాట్లాడుతూ " కొత్త ట్రెండ్ సెట్ చేసే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. రమేష్ వర్మగారు అద్భుతమైన కథ రాశారు. 'సెవెన్'లో నన్ను ఎంపిక చేసింది కూడా ఆయనే. అమేజింగ్ హీరోయిన్లతో నటించాను. హవీష్ అమేజింగ్ కోస్టార్. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారు. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది" అన్నారు.
సినిమాలో తారాగణం:
పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, 'జబర్దస్త్' వేణు, ధనరాజ్, సత్య, 'జోష్' రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు.
సినిమా సాంకేతిక వర్గం:
స్టిల్స్: శీను, పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి, డీఐ: లెజెండ్ స్టూడియో, కలరిస్ట్ రంగ, వి.ఎఫ్.ఎక్స్: ప్రసాద్ గ్రూప్, చీఫ్ కో-డైరెక్టర్: వేణు పిళ్ళై, కో-డైరెక్టర్: జగన్నాథ్ ఎం.ఆర్(రమేష్), ఆర్ట్ డైరెక్టర్: గాంధీ, లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్, కొరియోగ్రఫీ: సతీష్, విజయ్, డైలాగ్స్: జీఆర్ మహర్షి, స్టంట్స్: వెంకట్ మహేష్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్, కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ, సినిమాటోగ్రఫీ - దర్శకత్వం నిజార్ షఫీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments