హవీష్, అభిషేక్ పిక్చర్స్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Wednesday,May 29 2019]

హ‌వీష్ క‌థ‌నాయ‌కుడిగా కొత్త చిత్రం బుధ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. రొమాంటిక్ డ్రామా జోన‌ర్‌లో సినిమా రూపొంద‌నుంది. డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి సుకుమార్ క్లాప్ కొట్ట‌గా, స‌దానంద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మేక‌ర్స్‌కి సునీల్ నారంగ్ స్క్రిప్ట్‌ను అంద‌జేశారు.

రాఘ‌వ్ ఓంకార్ శ‌శిధ‌ర్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించే ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.