తప్పు తెలుసుకున్నా.. వైసీపీలో చేరుతా!
- IndiaGlitz, [Thursday,March 21 2019]
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీకి కోలుకోలేని షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా జంపింగ్‌లు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కర్నూలు సిటీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేశారు.
2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి అనంతరం భూమా ఫ్యామిలీతో పాటు ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో కర్నూలు తరఫున పోటీ చేయడాని టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతప్తికి లోనైనా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఎస్వీ సిద్ధమవుతున్నారు. గురువారం మధ్యాహ్నం అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన ఆయన వైసీపీలోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని.. తామే పార్టీ మారి అన్యాయం చేశామన్నారు. తప్పు తెలుసుకున్నామని.. చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామన్నారు. కర్నూలులో వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్‌ను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు. కర్నూలులో తన సత్తా ఏంటో చూపిస్తానని తెలిపారు.
ఎంతో అభివృద్ధి చేశా..
కర్నూలు నగరాన్ని ఏంతో అభివృద్ధి చేశాను. టీజీ వెంకటేష్ చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధి పనులు చేశాను. టీడీపీలో చేరరతానని నేను అడగలేదు.. భూమా నాగిరెడ్డిపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబే పార్టీలో చేర్చుకున్నారు. వైసీపీలో ఉంటే అభివృద్ధి చేయలేమని కార్యకర్తలు కోరిక మేరకు టీడీపీలో చేరాం. చంద్రబాబు నాకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదు.
డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యవస్థలో రాజకీయాలు చేయడం కష్టం...బుట్టా రేణుక ను , నన్ను భారీ మొసంతో బయటికి పంపారు. చేసిన తప్పును సరిదిద్దుకొని వైసీపీలో చేరుతాను. రాబోయే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారు అని ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.