మ్యాచ్ కి ముందు సెక్స్ చేయండి.. టీంఇండియాకి అతడి సలహా
Send us your feedback to audioarticles@vaarta.com
కీలకమైన మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు ఎలాంటి క్రికెటర్ కి అయినా ఎంతోకొంత ఆందోళన ఉంటుంది. మిస్టర్ కూల్ ధోని కూడా కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి లోనవుతుండడం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ప్రపంచకప్ లాంటి బిగ్ టోర్నీ ఆడుతున్నప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఆటగాళ్ల ఒత్తిడి పోగొట్టేందుకు కోచ్, ఫిజియో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. టీం ఇండియా 2011 ప్రపంచకప్ ఆడుతున్న సమయంలో ప్యాడి అప్టన్ మానసిక కోచ్ గా పనిచేశారు. స్వస్థలంలో జరుగుతున్న ప్రపంచకప్ కావడంతో మిగిలిన టీమ్స్ కన్నా టీంఇండియాపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఇదీ చదవండి: తనని బ్యాన్ చేసిన ట్విట్టర్ కి పోటీగా 'గెట్టెర్'.. ట్రంపా మజాకా!
అది గమనించిన ప్యాడి ఆటగాళ్లకు ఓ వింత సూచన చేశాడట. ఈ విషయాన్ని ప్యాడి తన ఆటోబయోగ్రఫీ 'ది బేర్ ఫుట్ కోచ్' లో రాసుకున్నారు. ఆటగాళ్లు ఒత్తిడి జయించడానికి మ్యాచ్ కి ముందు శృంగారం చేయాలని సలహా ఇచ్చా. నా సలహాకు హెడ్ కోచ్ గ్యారీ క్రిస్టెన్ నోట మాటలు రాలేదు. అతడు ఆశ్చర్యపోయాడు.
ప్యాడి ఇచ్చిన ఈ సలహాని ఆటగాళ్లు పాటించారో లేదో కానీ 2011 ప్రపంచ కప్ రిజల్ట్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. టీం ఇండియా రెండవసారి ప్రపంచకప్ లో జయకేతనం ఎగురవేసి విశ్వవిజేతగా నిలిచింది.
2009ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా శృంగారం వల్ల కలిగే లాభాలని వివరంగా రాశానని.. దానివల్ల ఆటగాళ్ల ప్రదర్శన తప్పకుండా మెరుగవుతుందని ప్యాడి పేర్కొన్నారు. ప్యాడి ఆటగాళ్ల మానసిక స్థితిపై బాగా అధ్యయనం చేసినట్లు ఉన్నాడు. ఎంతైనా మానసిక కోచ్ కదా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout