అతిథి పాత్ర‌తో హ్యాట్రిక్ కొడుతుందా?

  • IndiaGlitz, [Monday,June 04 2018]

'మ‌హాన‌టి'తో కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సావిత్రి పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు.. ఆమెకు న‌టిగా మంచి గుర్తింపును తీసుకువ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో.. కీర్తి త‌దుప‌రి చిత్రాల‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. అయితే.. ప్ర‌స్తుతం కీర్తి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అయితేనేం.. ఈ ఏడాది సెకండాఫ్‌లో వ‌రుస పెట్టి త‌న త‌మిళ చిత్రాల డ‌బ్బింగ్ వెర్ష‌న్స్‌తో తెలుగులోనూ సంద‌డి చేయ‌నుంది. వీటిలో విక్ర‌మ్ 'సామి స్క్వేర్‌', విశాల్ 'పందెం కోడి 2'తో పాటు విజ‌య్ - మురుగ‌దాస్‌ల చిత్రం కూడా ఉంది. వీటితో పాటు మ‌రో త‌మిళ సినిమాలోనూ న‌టించ‌నుంది కీర్తి.

అయితే.. అది హీరోయిన్‌గా కాదు. జ‌స్ట్‌.. గెస్ట్ అప్పీరియ‌న్స్. 'రెమో' చిత్రంతో తెలుగువారికి ద‌గ్గ‌రైన శివ‌కార్తికేయ‌న్ ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు. స‌మంత క‌థానాయిక‌గా.. సిమ్ర‌న్ ఓ కీల‌క పాత్ర‌లో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి ఓ అతిథి పాత్ర‌లో మెర‌వ‌నుంది. 'సీమా రాజా' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే తెర‌పైకి రానుంది. శివ‌కార్తికేయ‌న్‌తో ఇప్ప‌టికే 'ర‌జ‌నీ మురుగ‌న్‌', 'రెమో'తో రెండు విజ‌యాలు అందుకున్న కీర్తి.. ఇప్పుడు చేస్తున్న అతిథి పాత్ర‌తో హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.