జెన్నిఫర్.. మీ త్యాగానికి ప్రపంచం హ్యాట్సాఫ్!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో.. ఆ పేరెత్తితేనే వణికిపోతున్న క్రమంలో.. మందులు లేకుండా శవాలు గుట్టల్లా తేలుతున్న సందర్భంలో.. నాపైన టెస్ట్‌లు చేసి మందు కనిపెట్టండి.. ప్రపంచ ప్రజలు సంక్షేమం కోసం అవసరమైతే నా ప్రాణాలు పోయినా ఫర్లేదు.. అని ఓ 43 మహిళ ముందుకొచ్చింది. ఆమె మరెవరో కాదు.. జెన్నిఫర్‌. ఈమె ఇప్పుడు కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి ఓ వెలుగు రేఖ అయింది. ఆమె ధైర్యానికి, తెగువకు యావ్ ప్రపంచం జై కొడుతూ.. జేజేలు కొడుతోంది.

పూర్తి వివరాల్లోకెళితే..

అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నా సంస్థల శాస్త్రవేత్తలు ఎంఆర్ఎన్ఏఎన్ 1273 పేరుతో ఓ వ్యాక్సిన్‌ను కనుగొనడం జరిగింది. అయితే.. ఈ వ్యాక్సిన్‌ను నేరుగా మనుషులపై పరీక్షించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఎవరు ముందుకొస్తారా.? వేచి చూస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన 43 ఏళ్ళ జెన్నిఫర్ హాలెర్ కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి వేగు చుక్క అయ్యారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగానికి ఆమె స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్ స్థాయిలో ఉన్న ఆమె తన శరీరాన్ని ప్రయోగాలకు వేదికగా మార్చారు. వైరస్ ప్రభావం వల్ల కంపెనీలు మూసేశారు. ఇలా జెన్నీఫర్ కుటుంబమే కాదు లక్షాలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయ్. ఈ సమయంలో ఆమె ఆలోచనలో పడ్డారు. ఏం చేద్దాం..? ఏం చేస్తూ ప్రపంచ ప్రజానీకానికి పనికొస్తుంది..? ఇలానే ప్రపంచ ప్రజానీకం చనిపోతూ పోతే పరిస్థితి ఎలా..? ఈ చావులకు ఫుల్ స్టాప్ పడాలి కదా..? అనే తెగువతో ఆ నారీ ముందుకొచ్చింది. ఇంతలో వ్యాక్సిన్ ప్రయోగంపై నోటిఫికేషన్ రానే వచ్చింది. దీంతో దరఖాస్తు చేసుకుని స్వచ్ఛందంగా ఆమె వెళ్లింది. తొలి వ్యాక్సిన్ షాట్‌ను జెన్నీఫరే కావడం గమనార్హమని చెప్పుకోవచ్చు. యావత్ ప్రపంచమే గడగడలాడుతుంటే జెన్నీఫర్ మాత్రం చాలా ధైర్యంగా ముందుకు రావడమనేది నిజంగా చాలా గ్రేట్.. ఆమె తెగువకు యావత్ ప్రజానీకం హ్యాట్సాప్ చెబుతోంది.

ప్రయోగం సక్సెస్ అయితే..!

కాగా.. ఈ టీకాను అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), మోడెర్నా సంస్థలు తయారుచేశాయి. దీని సాంకేతిక నామం ఎంఆర్ఎన్ఏఎన్ 1273. నిజానికి ఇప్పటి వరకు మనుషులకు ప్రయోగించని ఈ ఔషధాన్ని తీసుకునేందుకు బోల్డంత ధైర్యం కావాలి. ఎందుకంటే శరీరంలోకి వెళ్లాక అది ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. ఈ పరీక్షలు విజయవంతమైతే ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ మహమ్మారికి మూడినట్టే. ప్రయోగం విజయవంతం కావాలని, ఆమె పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రపంచం కోరుకుంటోంది. ఆమె త్యాగాన్ని ప్రశంసిస్తోంది. ఈ టీకా విజయవంతమైనా.. అవ్వకపోయినా ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం జెన్నిఫర్ చేసిన త్యాగానికి మనందరం ఎప్పుడూ రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రయోగం సక్సెస్ కావాలనే అందరం కోరుకుందాం.

More News

ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై నిషేధం: ఎవరూ బయటికి రావొద్దు!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరి గంటగంటకూ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు

విల‌నిజాన్ని చూపించబోతున్న భూమిక

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఖుషీలో న‌టించిన భూమిక చావ్లా హీరోయిన్‌గా స్టార్ హీరోల‌తో న‌టించింది. అదే స‌మ‌యంలో నిర్మాత‌గా మారింది.

నాని సినిమాకు సీక్వెల్ ఉందా ?

నాని సినిమాకు సీక్వెలా ఉందా? అవును నాని నిర్మిస్తున్న హిట్ సినిమాకు సీక్వెల్‌గా హిట్ 2 చేస్తున్నారుగా అనుకునురు. కానీ ఇక్క‌డ నాని నిర్మాత‌గా చేస్తున్న సినిమా కాదు. నాని హీరోగా చేసిన సినిమా.

మహారాష్ట్ర భక్తుడి ఎఫెక్ట్ : తిరుమలలో దర్శనాలు నిలిపివేత

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం తిరుమలేశునిపై కూడా పడింది. ఇప్పటికే భక్తుల దర్శనాలను నియంత్రించిన టీటీడీ తాజాగా.. స్వామి వారికి కైంకర్యాలను మాత్రం కొనసాగిస్తూ..

ఆశలు ఆవిరి.. నిర్భయ నిందితులకు రేపే ఉరి..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అతి భయంకరమైన నిర్భయ కేసులో ఎట్టకేలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారైపోయింది. ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ అవ్వగా.. దోషులు సుప్రీంకోర్టు, రాష్ట్రపతిని ఆశ్రయిండంతో