జెన్నిఫర్.. మీ త్యాగానికి ప్రపంచం హ్యాట్సాఫ్!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో.. ఆ పేరెత్తితేనే వణికిపోతున్న క్రమంలో.. మందులు లేకుండా శవాలు గుట్టల్లా తేలుతున్న సందర్భంలో.. నాపైన టెస్ట్‌లు చేసి మందు కనిపెట్టండి.. ప్రపంచ ప్రజలు సంక్షేమం కోసం అవసరమైతే నా ప్రాణాలు పోయినా ఫర్లేదు.. అని ఓ 43 మహిళ ముందుకొచ్చింది. ఆమె మరెవరో కాదు.. జెన్నిఫర్. ఈమె ఇప్పుడు కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి ఓ వెలుగు రేఖ అయింది. ఆమె ధైర్యానికి, తెగువకు యావ్ ప్రపంచం జై కొడుతూ.. జేజేలు కొడుతోంది.
పూర్తి వివరాల్లోకెళితే..
అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నా సంస్థల శాస్త్రవేత్తలు ఎంఆర్ఎన్ఏఎన్ 1273 పేరుతో ఓ వ్యాక్సిన్‌ను కనుగొనడం జరిగింది. అయితే.. ఈ వ్యాక్సిన్‌ను నేరుగా మనుషులపై పరీక్షించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఎవరు ముందుకొస్తారా.? వేచి చూస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన 43 ఏళ్ళ జెన్నిఫర్ హాలెర్ కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి వేగు చుక్క అయ్యారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగానికి ఆమె స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్ స్థాయిలో ఉన్న ఆమె తన శరీరాన్ని ప్రయోగాలకు వేదికగా మార్చారు. వైరస్ ప్రభావం వల్ల కంపెనీలు మూసేశారు. ఇలా జెన్నీఫర్ కుటుంబమే కాదు లక్షాలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయ్. ఈ సమయంలో ఆమె ఆలోచనలో పడ్డారు. ఏం చేద్దాం..? ఏం చేస్తూ ప్రపంచ ప్రజానీకానికి పనికొస్తుంది..? ఇలానే ప్రపంచ ప్రజానీకం చనిపోతూ పోతే పరిస్థితి ఎలా..? ఈ చావులకు ఫుల్ స్టాప్ పడాలి కదా..? అనే తెగువతో ఆ నారీ ముందుకొచ్చింది. ఇంతలో వ్యాక్సిన్ ప్రయోగంపై నోటిఫికేషన్ రానే వచ్చింది. దీంతో దరఖాస్తు చేసుకుని స్వచ్ఛందంగా ఆమె వెళ్లింది. తొలి వ్యాక్సిన్ షాట్‌ను జెన్నీఫరే కావడం గమనార్హమని చెప్పుకోవచ్చు. యావత్ ప్రపంచమే గడగడలాడుతుంటే జెన్నీఫర్ మాత్రం చాలా ధైర్యంగా ముందుకు రావడమనేది నిజంగా చాలా గ్రేట్.. ఆమె తెగువకు యావత్ ప్రజానీకం హ్యాట్సాప్ చెబుతోంది.
ప్రయోగం సక్సెస్ అయితే..!
కాగా.. ఈ టీకాను అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), మోడెర్నా సంస్థలు తయారుచేశాయి. దీని సాంకేతిక నామం ఎంఆర్ఎన్ఏఎన్ 1273. నిజానికి ఇప్పటి వరకు మనుషులకు ప్రయోగించని ఈ ఔషధాన్ని తీసుకునేందుకు బోల్డంత ధైర్యం కావాలి. ఎందుకంటే శరీరంలోకి వెళ్లాక అది ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. ఈ పరీక్షలు విజయవంతమైతే ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ మహమ్మారికి మూడినట్టే. ప్రయోగం విజయవంతం కావాలని, ఆమె పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రపంచం కోరుకుంటోంది. ఆమె త్యాగాన్ని ప్రశంసిస్తోంది. ఈ టీకా విజయవంతమైనా.. అవ్వకపోయినా ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం జెన్నిఫర్ చేసిన త్యాగానికి మనందరం ఎప్పుడూ రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రయోగం సక్సెస్ కావాలనే అందరం కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com