తారక్ సినిమాతో హ్యాట్రిక్ కొడుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
చేసింది రెండు సినిమాలే. కానీ ఆ రెండు సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కేరళ కుట్టి నివేదా థామస్. నేచురల్ స్టార్ నానితో జెంటిల్‌మేన్, నిన్ను కోరి అంటూ బ్యాక్ టు బ్యాక్ రెండు వరుస విజయాలను సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. ఈ రెండు చిత్రాలలోనూ నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో సందడి చేసిన నివేదా.. మూడో చిత్రంగా జైలవకుశ చేస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే నెల 21న విడుదల కానున్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ కొడతానన్న ధీమాతో ఉందట నివేదా థామస్. మరి ఆమె నమ్మకం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com