విష్ణు సినిమా ఆగిపోయిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు విష్ణు హీరోగా డి.కుమార్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో సినిమా రూపొందుతోన్న చిత్రం సరదా. అడ్డా` ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో,సోమా విజయ్ ప్రకాష్ పల్లి కేశవరావ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. జాదూగాడు` ఫేమ్ సోనారిక ఒక హీరోయిన్ గా ప్రారంభమైన ఈ చిత్రం ఎప్పుడో మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.
ఈ సినిమా కోసం విష్ణు సిక్స్ ప్యాక్ కూడా చేయడం విశేషం. అయితే ఈ సినిమాకు సంబంధించిన తదుపరి వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఆరా తీస్తే కొన్ని కారణాలతో సినిమా ఆపేశారని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. మరి ఆ కారణాలేమిటనేది తెలియడం లేదు. మరి అసలు సంగతి దర్శక నిర్మాతలకే ఎరుక...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments