లాడెన్ కొడుకును అమెరికా నిజంగానే చంపిందా!?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ బిన్‌లాడెన్ కుమారుడు హామ్జా బిన్ లాడెన్ చనిపోయినట్లు గురువారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. అమెరికాకు చెందిన పలు ప్రముఖ పత్రికలు, టీవీ చానెళ్లు సైతం ఈ విషయాన్ని హెడ్‌లైన్స్‌లో వేశాయి. గత రెండేళ్లుగా లాడెన్ కుమారుడి కోసం అమెరికా గాలిస్తున్న విషయం విదితమే. అయితే హామ్జాను ఎట్టకేలకు పట్టుకుని హతమార్చి తాము విజయం సాధించామని అమెరికా అనుకుంటోందట. కాగా, అమెరికాలో ఈ వ్యవహారంపై ఈ రేంజ్‌లో హడావుడి జరుగుతున్నా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు.. అంతేకాదు కనీసం చిన్నపాటి ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం.
నిజమేనా.. నోరు మెదపరేం ట్రంప్!
వాస్తవానికి.. ట్రంప్ ఏ పనిచేసినా తాను ఇది చేశాను.. అది చేశానని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో మాత్రం నొరు మెదపకపోవడంతో నిజంగానే లాడెన్ కొడుకును అమెరికా చంపిందా..? లేకుంటే పుకార్లు పుట్టించారా..? అనే అనుమానాలు జనాలకు కలుగుతున్నాయి. అంతేకాదు.. తండ్రి మృతి తర్వాత అల్ ఖైదాకు వారసుడిగా ఉన్న హమ్జా మృతికి సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని ఎన్‌బీసీ వార్తా సంస్థ వెల్లడించడం గమనార్హం. అంతేకాదు.. హమ్జా మృతిని అమెరికా అధికారులు కూడా ధ్రువీకరించినట్టు తమకు సమాచారం ఉందని ఎన్‌బీసీ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది.
ఇదీ అసలు కథ..!
లాడెన్ కుమారుడిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా 1మిలియన్ డాలర్ రివార్డు ప్రకటించిన విషయం విదితమే. లాడెన్ చనిపోయిన తర్వాత అల్‌ఖైదా పగ్గాలు చేపట్టిన హంజాబిన్ చివరిసారిగా 2018లో మీడియాకు విడుదల చేసిన వీడియోలో సౌదీఅరేబియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న అమెరికా.. హంజాబిన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. రెండేళ్లుగా అతని కోసం తీవ్రంగా గాలిస్తోంది. హంజాబిన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి.. ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టింది. అతని ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. అప్పట్నుంచి తీవ్రగాలింపులతో తాజాగా ఆయన్ను మట్టుబెట్టిందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com