బిత్తిరి సత్తిని టీవీ9 తొలగించిందా? లేదంటే ‘బిగ్‌బాస్’ కారణమా?

  • IndiaGlitz, [Wednesday,June 24 2020]

ఇటీవలి కాలంలో వీ6 ఛానల్ నుంచి బయటకు వచ్చి వార్తల్లో నిలిచిన బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవి మరోసారి చర్చనీయాంశంగా మారాడు. దానికి కారణం ఆయన టీవీ9 నుంచి కూడా బయటకు రావడమే. వీ6 ఛానల్ ఆయనను బిత్తిరిసత్తిగా.. సమాజంలో ఓ సెలబ్రిటీగా ఆయనను నిలబెట్టింది. కానీ టీవీ 9 సంస్థ మరింత ఎక్కువ ప్యాకేజ్ ఇస్తుండటంతో అక్కడి నుంచి మారిపోయారు. ఇప్పుడు టీవీ 9 నుంచి కూడా నిష్క్రమించాల్సి వచ్చింది.

బిత్తిరి సత్తి టీవీ9 నుంచి బయటకు రావడానికి కారణమిదేనా?

వీ6 లో తీన్‌మార్ వార్తలకు వచ్చినంత క్రేజ్.. టీవీ9లో వస్తున్న ఇస్మార్ట్ న్యూస్‌కు దక్కలేదనే చెప్పాలి. టీఆర్పీ రేటింగ్ పరంగా కూడా ఈ షో వెనకబడినట్టు తెలుస్తోంది. దీనికి తోడు కరోనా కూడా తోడవడంతో కొందరిని తొలగించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని టీవీ9 భావించిందని సమాచారం. ఈ నేపథ్యంలో భారీగా పారితోషికం పొందుతున్న వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని యాజమాన్యం భావించిందని దానిలో భాగంగానే బిత్తిరిసత్తికి టీవీ9 ఉద్వాసన పలికిందని ఒక టాక్.

మరో టాక్ ఏంటంటే..

బిత్తిరిసత్తికి బిగ్‌బాస్ షో నుంచి ఆఫర్ వచ్చిందట. ఈ క్రమంలో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని కొందరు చెబుతున్నారు. మరో టాక్ ఏంటంటే తీన్‌మార్ నుంచి కలిసి చేస్తున్న శివజ్యోతికి, బిత్తిరి సత్తికి ప్రస్తుతం అస్సలు పడటం లేదని తెలుస్తోంది. టీవీ9కి వెళ్లిన దగ్గర నుంచి కాస్త శివజ్యోతి డామినేషన్ పెరిగిందని సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరికీ పడక బిత్తిరి సత్తి బయటకు వచ్చాడని సమాచారం.
 

More News

తెలంగాణలో మరింత ఉధృతమవుతోన్న కరోనా

తెలంగాణలో పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది.

ఏపీలో 10 వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల మార్క్ దాటింది. 36 వేల 47 శాంపిల్స్‌ను పరీక్షించగా..

సూర్యాకాంతం సీరియల్ షూటింగ్ ప్రారంభమైన కాసేపటికే ప్యాకప్..

గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో సీరియల్స్ షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. కొన్ని ఛానళ్లలో సీరియల్స్ ఇప్పటికే ప్రారంభమవగా..

ఆసక్తి పెంచుతున్న ‘భానుమతి రామకృష్ణ’ టీజర్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకు ప్రారంభ‌మైన ప‌క్కా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’.

నందినీ రాయ్ సూసైడ్ స్టోరీ

సెలబ్రిటీ హోదా రాగానే బాధ్యత పెరుగుతుంది. దాని వల్ల తెలియకుండా ఇన్ సెక్యూరిటీ పెరుగుతుంది.