అ ఆ రిలీజ్ డేట్ మళ్లీ మారిందా..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నితిన్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అ ఆ. ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా రూపొందిన అ ఆ చిత్రాన్ని మే 6న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ..కుదరలేదు.
ఆతర్వాత మే 27న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ డేట్ కు కూడా రిలీజ్ చేయడం కుదరడం లేదు. ఇటీవల అ ఆ చిత్రాన్ని జూన్ 3న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. మళ్లీ అ ఆ రిలీజ్ డేట్ మారిందట. తాజా సమాచారం ప్రకారం...తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2న అ ఆ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి..ఈసారైనా రిలీజ్ డేట్ మారకుండా జూన్ 2న అ ఆ రిలీజ్ అవుతుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments