స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ సరే.. ఒప్పుకున్నారా!?
Send us your feedback to audioarticles@vaarta.com
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌తో ఢిల్లీలో చక్రం తిప్పాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు రావాలని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీలను ఆదరించేవారెవ్వరూ లేరని కచ్చితంగా ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పుతాయని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రాల హక్కులు సాధించుకోవాలంటే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు కేంద్రంలో అధికారంలోకి రావాలని కేసీఆర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఓ వైపు కేసీఆర్.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రాల బాట పట్టారు.
ఇప్పటికే పలు పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్.. సోమవారం సాయంత్రం డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు కేసీఆర్.. స్టాలిన్‌తో చర్చలు జరిపారు. చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. భేటీలో ఫెడరల్ ఫ్రంట్ విషయమై ఇద్దరి మధ్య సుమారు చాలా గంటకు పైగా భేటీ జరిగింది. భేటీ అయితే జరిగింది కానీ..ఈ సమావేశంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత్ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్టాలిన్ ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్-డీఎంకే పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి.
అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు కూడా మంచిగా ఉండటంతో డీఎంకే కూడా హస్తంతో చేయికలిపి ముందుకెళ్తోంది. అయితే ఈ తరుణంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు స్టాలిన్ సహకరిస్తారా..? లేకుంటే విన్నంత సేపు విని మిన్నకుండిపోతారా..? లేదా.. ఫలితాల తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పేసి కేసీఆర్‌ను పంపుతారా..? అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక వేళ స్టాలిన్ ఒప్పుకోకపోతే కేసీఆర్ పరిస్థితేంటి..? అనేది తెలియాల్సి ఉంది. కాగా తమిళనాడు పర్యటన అనంతరం గులాబీ బాస్ కర్ణాటక వెళ్లనున్నారని తెలిసింది.. సో.. చివరికి కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో మరో పది రోజుల్లో తేలిపోనుందన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments