స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ సరే.. ఒప్పుకున్నారా!?

  • IndiaGlitz, [Monday,May 13 2019]

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌తో ఢిల్లీలో చక్రం తిప్పాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు రావాలని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీలను ఆదరించేవారెవ్వరూ లేరని కచ్చితంగా ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పుతాయని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రాల హక్కులు సాధించుకోవాలంటే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు కేంద్రంలో అధికారంలోకి రావాలని కేసీఆర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఓ వైపు కేసీఆర్.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రాల బాట పట్టారు.

ఇప్పటికే పలు పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్.. సోమవారం సాయంత్రం డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు కేసీఆర్.. స్టాలిన్‌తో చర్చలు జరిపారు. చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. భేటీలో ఫెడరల్ ఫ్రంట్ విషయమై ఇద్దరి మధ్య సుమారు చాలా గంటకు పైగా భేటీ జరిగింది. భేటీ అయితే జరిగింది కానీ..ఈ సమావేశంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత్ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్టాలిన్ ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్-డీఎంకే పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి.

అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్‌‌కు ఓటు బ్యాంకు కూడా మంచిగా ఉండటంతో డీఎంకే కూడా హస్తంతో చేయికలిపి ముందుకెళ్తోంది. అయితే ఈ తరుణంలో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్టాలిన్ సహకరిస్తారా..? లేకుంటే విన్నంత సేపు విని మిన్నకుండిపోతారా..? లేదా.. ఫలితాల తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పేసి కేసీఆర్‌ను పంపుతారా..? అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక వేళ స్టాలిన్‌ ఒప్పుకోకపోతే కేసీఆర్ పరిస్థితేంటి..? అనేది తెలియాల్సి ఉంది. కాగా తమిళనాడు పర్యటన అనంతరం గులాబీ బాస్ కర్ణాటక వెళ్లనున్నారని తెలిసింది.. సో.. చివరికి కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో మరో పది రోజుల్లో తేలిపోనుందన్న మాట.

More News

వీహెచ్‌ వ్యవహారంలో నగేశ్‌కు షాకిచ్చిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)పై ఇటీవల అఖిలపక్షం ధర్నాలో పీసీసీ కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

రొమాంటిక్ క్రిమినల్స్ అందరినీ మెప్పిస్తుంది : సునీల్ కుమార్ రెడ్

ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌ క‌థ‌ లాంటి సందేశాత్మ‌క, క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రాలు అందించ‌డమే కాకుండా కంటెంట్ వున్న చిత్రాల‌కు పెద్ద బ‌డ్జెట్ అవ‌స‌రం లేద‌ని నిరూపించి టాలీవుడ్

బాలీవుడ్‌లో అంచనాలు పెంచేస్తున్న 'కబీర్ సింగ్'

విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటీనటులుగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో కొత్తగా చెప్పనక్కర్లేదు.

'ఫలక్‌ నుమా దాస్‌' ట్రైలర్‌ చాలా బాగుంది, సినిమా బ్లాక్‌బ్లస్టర్‌ హిట్‌ కావాలి - వెంకటేష్‌

'వెళ్ళిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది' లాంటి చిత్రాలలో తనదైన నటనతో మంచి గుర్తిపు తెచ్చుకున్నారు నటుడు విశ్వక్‌ సేన్‌. ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఫలక్‌ నుమా దాస్‌'.

మా స్కూల్స్‌తో మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు!

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి విద్యారంగంలోకి అడుగుపెట్టారని.. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.