'సీత' విడుదల వాయిదా పడ్డట్టేనా?
- IndiaGlitz, [Monday,April 22 2019]
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సీత'. ఈ సినిమాపై బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ఆశలనే పెట్టుకున్నాడట. తేజకి కూడా ఈ సినిమా సక్సెస్ కావడం ఎంతో అవసరం. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తర్వాత తేజ 'యన్.టి.ఆర్' బయోపిక్‌ను తెరకెక్కించాల్సింది.
చివరకు తేజ కొన్ని కారణాలతో యన్.టి.ఆర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. వెంకటేష్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. వీటన్నింటినీ దాటి.. తేజ 'సీత' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయ్యిందని.. ఏప్రిల్ 25న సినిమా విడుదల కావాల్సి ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడ్డట్టు కనపడుతుంది.
సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అయితే బిజినెస్ కాకపోవడంతో పాటు రీసెంట్‌గా విడుదలైన సినిమాలు చిత్రలహరి, మజిలీ, జెర్సీలు సూపర్‌హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. దీంతో థియేటర్స్ దొరకడం కష్టంగానే అనిపిస్తున్నాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం సినిమాను మే 17న విడుదల చేయవచ్చునని వార్తలు వినపడుతున్నాయి.