Harish Rao: మంత్రి హరీష్‌రావు అత్యుత్సాహమే కొంపముంచిందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈసీ నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ భారీ ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 2018లో ఇలాగే ఎన్నికలకు ముందు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేశారు. అప్పుడు బీఆర్‌ఎస్ ఏకంగా 88 స్థానాల్లో గెలిచి రెండో సారి అధికారం చేపట్టింది. ఈసారి కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ కానున్నాయని.. అది ఆ పార్టీకి గేమ్‌ఛేంజర్‌గా మారి ఆ పార్టీకి కలిసివస్తుందని అందరూ భావించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. కానీ మంత్రి హరీష్ రావు అత్యుత్సాహంతో పరిస్థితి మొత్తం ఒక్కసారిగా తారుమారైంది.
టింగ్ టింగ్ అంటూ ఫోన్లు మోగుతాయి..
నవంబర్ 26న పాలకుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ "మంగళవారం ఉదయం రైతులు ఛాయ్ తాగే సమయానికి టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతుల ఫోన్లకు డబ్బులు పడినట్లు మెసేజ్‌లు వస్తాయి" అని తెలిపారు. అలాగే దేవుడు మన వైపు ఉన్నాడు కాబట్టే రైతుబంధుకు అనుమతి వచ్చిందని.. రైతుబంధు ఇచ్చిన కేసీఆర్‌ను ఎవరూ మర్చిపోరంటూ పేర్కొన్నారు. అయితే ఈసీ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రైతుబంధుకు సంబంధించి నేతలెవరూ ప్రచారం చేసుకోకూడదు. కానీ ఆ నిబంధనలు ఉల్లంఘించి రైతుబంధు డబ్బులు మంగళవారం రైతుల అకౌంట్లో పడతాయని హరీష్‌రావు తెలిపారు. అంతే హరీష్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఈసీ స్పష్టంచేస్తూ రైతుబంధు విడుదలకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. మొత్తానికి మంత్రి హరీష్ రావు అత్యుత్సాహం రైతుబంధు ఆగిపోయేలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హరీష్ వల్లే రైతుబంధు ఆగిపోయింది..
రైతుబంధు విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఉపసంహరించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం ప్రభుత్వానికి లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం ఇందుకు నిదర్శనమన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15వేలు రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని ఆయన వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com