నితిన్ సినిమా ఆగిందా..?

  • IndiaGlitz, [Wednesday,November 23 2016]

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మాత‌లుగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్ ఇటీవ‌ల ప్రారంభ‌మైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. రీసెంట్‌గా లోకేష‌న్స్ కూడా ఓకే అయ్యాయి. ఈ చిత్రంలో మేఘ ఆకాష్ హీరోయిన్‌గా న‌టించనుంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు బ్రేక్ ప‌డింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకు కార‌ణం నితిన్ భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయ‌డ‌మేన‌ట‌. అయితే నిర్మాత‌లు అంత ఇచ్చుకోలేమ‌ని చెప్ప‌డంతో నితిన్ కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్‌క‌ల్యాన్‌, త్రివిక్ర‌మ్ నిర్మాత‌లుగా రూపొంద‌నున్న సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులోనిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే...

More News

క్రమశిక్షణ - సమయపాలన విజయానికి సోపానాలు - కేరాఫ్ గోదావరి కధానాయకుడు రోహిత్

పంక్చువాలిటీ,డిసిప్లిన్ ఓ పర్సన్ సక్సస్ లో కీ రోల్ ప్లే చేస్తాయని అన్నారు యువ కధానాయకుడు రోహిత్.ఎస్.'కేరాఫ్ గోదావరి'

విక్రమ్ మూవీ సీక్వెల్ కి అంతా రెడీ..!

విభిన్న కథా చిత్రాల్లో...విభిన్న గెటప్స్ తో ఆకట్టుకుంటూ తెలుగు,తమిళ్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న హీరో విక్రమ్.

'ఒక్కడొచ్చాడు' రిలీజ్ పై విశాల్ క్లారిటీ...

పందెంకోడి,పొగరు,భరణి,పూజ,రాయుడు వంటి హిట్ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా 'ఒక్కడొచ్చాడు'.

డిసెంబర్ 5న సూర్య ఎస్3 (సింగం-3) పాటలు విడుదల

తమిళం,తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్ ను,మార్కెట్ ను సంపాందించుకున్న వెర్సటైల్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3.

చరణ్ ధృవ ట్రైలర్ వచ్చేస్తుంది..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ధృవ.