నితిన్ సినిమా ఆగిందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్‌స్టార్ నితిన్ హీరో వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మాతలుగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. రీసెంట్గా లోకేషన్స్ కూడా ఓకే అయ్యాయి. ఈ చిత్రంలో మేఘ ఆకాష్ హీరోయిన్గా నటించనుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు బ్రేక్ పడిందని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం నితిన్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమేనట. అయితే నిర్మాతలు అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో నితిన్ కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా రూపొందనున్న సినిమా చేయడానికి రెడీ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఇందులోనిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com